అమరావతి నుండి రాజధానిని మూడు భాగాలుగా చేస్తూ అటు వైజాగ్, ఇటు కర్నూల్ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటికే రాజధానిని అమరావతి నుండి తరలించడం పై ప్రత్యర్ధ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. అయితే అమరావతి నిర్వహణ ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని, అందుకే రాజధానిని ఇక్కడ ఉంచడం కంటే మరో ప్రాంతానికి తరలించడమే కరక్ట్ అనే వాదన ను బలంగా వినిపిస్తుంది జగన్ సర్కార్. టిడిపి కి చెందిన వ్యక్తులకు… అలాగే ఎక్కువగా కమ్మ సామజిక వర్గానికి ఎక్కువగా భూములు ఉన్నాయన్న ప్రచారం జరగడంతో సామాన్యులకు ఇక్కడ న్యాయం జరగదన్న తలంపుతోనే జగన్ రాజధానిని అమరావతి నుండి వైజాగ్ కు మార్చెసారు.
అయితే రాజధానిని విశాఖ కు మారిస్తే ఇప్పటికే అక్కడి వైకాపా నాయకులూ భూములు మొత్తం కొనేశారనే టాక్ ఉంది. ప్రస్తుతం వైజాగ్ ని రాజధానిగా మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే అక్కడి భూముల రేట్లు ఆకాశానికి పెరిగాయి. రాష్ట్రంలో మూడు చోట్ల రాజధానులను పెట్టడం ద్వారా రాష్ట్రం మొత్తం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నది జగన్ వాదన. ఇక విశాఖ ను కూడా హైద్రాబాద్ లా మారుస్తామంటూ జగన్ సర్కార్ ప్రయత్నాలు మొదలెట్టింది. దేశంలో ప్రధాన నగరాలైన హైద్రాబాద్, బెంగుళూరు, ముంబై తరహాలో ఈ పదేళ్లలో అభివృద్ధి చేస్తామని, దేశంలోని ప్రధాన నగరాల్లో విశాఖ ను ఒకటిగా మారుస్తామని అంటున్నారు.
ఇక అభివృద్ధి మొత్తం ఒక్క విశాఖ కె పరిమితం చేస్తే మిగతా రెండు రాజధానుల పరిస్థితి ఏమిటి ? అక్కడి జనాలు ఊరుకుంటారా అన్న దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. మొత్తానికి జగన్ సర్కార్ మాత్రం విశాఖ ను రాజధానిగా ఎన్నుకుని అక్కడే అన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధం అయింది. తాజాగా రాష్ట్ర పాలనా మొత్తం వైజాగ్ నుండే జరిగేలా జగన్ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.