పోలీసులపై చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన స్ధాయికి తగనివని అధికారుల సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ పోస్టింగుల కోసం అధికార పార్టీ నేతలు ఏది చెబితే అదల్లా చేస్తున్నారంటూ పోలీసులపై చంద్రబాబు మండిపడిన విషయం అందరికీ తెలిసిందే.
ఇదే విషయమై పోలీసు అధికారుల సంఘం నేతలు మాట్లాడుతూ చంద్రబాబు తన స్ధాయికి తగని ఆరోపణలు చేస్తున్నట్లు మండిపడ్డారు. పోస్టింగుల కోసం ఏ పోలీసు కూడా కక్కుర్తి పడాల్సిన అవసరం లేదని వారు గట్టి రిప్లై ఇచ్చారు. సీనియారిటి, ప్రతిభ, క్రమశిక్షణ ఆధారంగానే తమకు పోస్టింగులు, బదిలీలు జరుగుతాయని స్పష్టంగా చెప్పారు.
సరే పోలీసు సంఘం నేతలు చెప్పారని కాదు కానీ తన హయాంలో చంద్రబాబు పోలీసులను ఏ విధంగా వాడుకున్నది తెలీదా ? వైసిపి ఎంఎల్ఏలు, నేతల్లో ఎంతమందిపై తప్పుడు కేసులు పెట్టించారు ? అదంతా పోలీసులను మ్యానేజ్ చేసుకుని చేసిందే కదా ?
జగన్మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం ఘటనలో డిజిపి ఠాకూర్ స్పందించిన విధానం ఎంత వివాదమైందో తెలీదా ? చంద్రబాబు కోసం కాకపోతే ఠాకూర్ ఎందుకు అలా స్పందిస్తారు ? ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు ఏ విధంగా పని చేసిందో స్వయంగా ఎన్నికల కమీషనే చెప్పింది కదా ? అధికారంలో ఎవరున్నా పోలీసుల వ్యవహారం ఇలాగే ఉంటుందని చంద్రబాబుకు తెలీదా ? తెలిసి కూడా వాళ్ళపై ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది.