జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అమరావతి రైతుల ఆందోళనపై మాట్లాడారు. రైతుల ఆందోళనకు యాభై రోజులు పూర్తయ్యాయని పవన్ అన్నారు. రైతులు, ఆడపడుచుల స్ఫూర్తి చూసి తెలుగు వాళ్ళు గర్విస్తున్నారని అయన అన్నారు. ఈ రోజు ఉదయం అయన మాట్లాడుతూ రోడ్డున పడ్డ రైతులకు తాను అండగా ఉంటానని పవన్ అన్నారు. ఈ నెల 10 తరువాత మరోసారి రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని చెప్పారు. రైతుల వాణి దేశం నలుమూలల వినిపించేలా నినాదిస్తానని అయన అన్నారు. రైతుల ఉద్యమానికి తన సంపూర్ణ మద్దత్తు ప్రకటిస్తున్నట్టు పవన్ తెలిపారు. జగన్ మూడు రాజధానుల వ్యవహారం నలుగురు నవ్వేలా ఉందని, రాష్ట్రం బాగుపడాలంటే పాలనా మొత్తం ఒక్కచోటినుండే జరగాలని పవన్ అభిప్రాయం పడ్డారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు తేవాలని, వాటిద్వారా అక్కడి లోకల్ యువతకు ఉద్యొగాలు వస్తాయని చెప్పారు. రాజధానులను మార్చినంత మాత్రానా అభివృద్ధి జరుగుతుందా అని ప్రశ్నిస్తున్నారు.