ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం పై మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజధాని విషయంలో కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందని, రాజధానిని తరలించడం సీఎం వల్ల కాదని అయన చెప్పారు. త్వరలోనే రాష్ట్ర నాయకులూ రాజధాని అంశాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. రాజధాని తరలిపోకుండా బీజేపీ ఆపగలదని అయన ఆశాభావం వ్యక్తం చేసారు. రాజధానికి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి .. రాజధాని తరలింపు అసాధ్యమని అయన అన్నారు. తాజాగా అయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషాన్ని సంతరించుకుంది. ఇప్పటికే రాజధాని విషయంలో అటు అమరావతి ప్రజలతో పాటు టిడిపి నాయకులూ వ్యతిరేకిస్తున్నా విషయం తెలిసిందే.
ఇప్పటికే ఆంధ్రా రాజధానిగా అమరావతితో పాటు కర్నూల్, వైజాగ్ లను కలుపుతూ మూడు రాజధానులుగా సీఎం వై ఎస్ జగన్ ప్రకటించారు. ప్రకటించడమే కాదు రాజధానుల తరలింపు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.