ఇచ్చిన హామీలను నెరవేర్చటం చాలా కష్టం. కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇపుడీ విషయం ఎందకంటే ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసేందుకు వీలుగా కొత్తగా ప్రజా రవాణా శాఖ అనే కొత్త డిపార్ట్ మెంటును ఏర్పాటు చేయాలని జగన్ డిసైడ్ చేశారు.
నిజానికి ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది ఉద్యోగుల దశాబ్దాల కల. ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు ఎప్పటి నుండో కోరుతున్నా ఏ ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించలేదు. చివరకు చంద్రబాబునాయుడు కూడా హామీ ఇచ్చారే కానీ తర్వాత పట్టించుకోలేదు.
మొన్నటి ఎన్నికల్లోను, అంతకుముందు పాదయాత్రలోను ఉద్యోగ సంఘాల నేతలు కలిసినపుడు జగన్ విలీనం హామీని ఇచ్చారు. అన్నట్లే అధికారంలోకి రాగానే సానుకూలంగా స్పందించారు. విలీనం ఏర్పాటుకు ఓ కమిటిని వేశారు. అయితే ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటానికి లీగల ప్రాబ్లెం ఉందని గుర్తించారు. కేంద్రప్రభుత్వానికి ఆర్టీసీలో 31 శాతం వాటు ఉంది. కాబట్టి రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా విలీనం చేయటం కష్టమని అర్ధమైపోయింది.
అందుకనే సంస్ధ విలీనాన్ని వదిలిపెట్టి ముందు ఉద్యోగులను మాత్రం ప్రభుత్వంలోకి తీసేసుకుంటున్నారు. ఈ నిర్ణయాన్ని బుధవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో మరోమారు చర్చించి ఆమోదముద్ర వేస్తారు. జగన్ తాజా నిర్ణయంతో వేలాదిమంది ఆర్టిసి ఉద్యోగులతో పాటు వారి కుటుంబాలు ఫుల్ హ్యాపీగా ఉన్నాయి.