బాధ్యతలు స్వీకరించిన వాసిరెడ్డి

వైసిపిలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న మరో నేత వాసిరెడ్డి పద్మ మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఉపముఖ్యమంత్రులు, అసెంబ్లీ స్పీకర్, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్ పర్సన్లు, ఎంఎల్ఏలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే అధికార పార్టీ నేత ఓ పదవిలో బాధ్యతలు తీసుకుంటున్నారంటే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన తొమ్మిదేళ్ళుగా వైసిపి గొంతును వాసిరెడ్డి అనేక వేదికలపై చాలా బలంగా వినిపించిన విషయం అందరకీ తెలిసిందే. టివి చర్చల్లో ప్రత్యర్ధుల వాదనలను చీల్చి చెండాడంలో వాసిరెడ్డి ఏమాత్రం మొహమాటపడరన్నది అందరూ చూసిన విషయమే.

అలాంటి వాసిరెడ్డికి మొన్నటి ఎన్నికల్లో పోటికి అవకాశం రాలేదు. ఎలాగూ పోటి చేయలేదు కాబట్టి ఏదో ఓ కీలక పోస్టు ఖాయంగా వస్తుందని వైసిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అందరూ ఊహిస్తున్నదే. అటువంటి నేపధ్యంలోనే వాసిరెడ్డిని మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ గా జగన్ నియమించారు.