రాష్ట్రంలో పార్టీలకే కాదు, నాయకులకు కంచు కోటలుంటాయి. చాలా మటుకు ఈ కోటలు శాశ్వతంగా ఉంటాయి. వాటిని మరొకరు ఆక్రమించడం చాలా కష్టం. ఉదాహరణకు పులివెందుల, కుప్పం సిద్ధిపేట లు ఇలాంటి కంచుకోటలు.అయితే హైద్రబాద్ నగరంలో ఒక నాయకుడికి ఉన్న కంచు కోట మాయమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఆ నాయకుడెవరో కాదు పి.జనార్ధన్ రెడ్డి, ఆయన కోటే ఖైరతాబాద్ నియోజకవర్గం…
రాష్ట్ర రాజకీయాల్లో మూడక్షరాలతో ప్రజల హృదయాలలో స్థిరపడిన నాయకులలో పిజెఆర్ ఒకరు. ఆయన మరణించినా కూడా ఆయన సేవలు,రాజకీయం ప్రజలు,నాయకులు మర్చిపోలేదు. అంత క్యాడర్ ఉన్నకోట ఇపుడు కనుమరుగవతున్నది. ఆయన వారసులకు కోట మీద వారసత్వం లేకుండా మాయమవుతున్నది.దీనితో ఆయన వారసుల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమయింది. బలమయిన వారసుడులేని పిజేఅర్ ప్యామిలి రాజకీయాలనుంచి దూరంగా చేసే కుట్ర జరగుతున్నదా? ఈ సందేహలకు సమాధానం తెలియాలి అంటే ఈ స్టోరి చదవండి.
హైద్రాబాద్ పాలిటిక్స్ లో బడా లీడర్లు చాలా మంది ఉన్నా మాస్ లీడర్ అంటే దివంగత నేత డ మాజీ ఎమ్మెల్యే పి.జేనార్దన్ రెడ్డియే. పిజెఆర్ అంటే తేలియని జనాలు సిటిలో ఉండరు ఏందుకంటే అన్ని చోట్ల ప్రత్యక్షమయిన ప్రజావసరాల తరఫున నిలబడే మనిషి ఆయన. ప్రజలకు ఎక్కడ అవసరమో అక్కడ వాలి పొతాడు.అలాంటి కమ్మిట్ మేంట్ ఉన్న మాస్ లీడర్ పిజేఅర్. ఆయన హఠాన్మరణం చాలా మంది పేదవారికి షాక్. ఆయన లేని కొరత పూరుతందన్న నమ్మకం కనిపించడం లేదు.
ఆయన మరణాంతరం జరిగిన ఎన్నికల్లో కూమారుడు విష్ణువర్దన్ రెడ్డి గెలుపోందాడు. తరువాత జరిగిన రాజకీయ పరిమణామాల వల్ల ఆయన కూతురు గట్టు విజయ రెడ్డి రాజకీయ రంగప్రవేశం చేసిన 2014 ఎన్నికల్లో వైసిపి నుంచి పోటిచేశారు. విజయం సాధించలేక పోయారు. ఆ సమయంలో ఆమె కాంగ్రేస్ పార్టీ మారడం పై విమర్శలు వెల్లువెత్తాయి.2009లో విజయ రెడ్డికి కాంగ్రేస్ పార్టీ టిక్కేట్ ఇవ్వకుండా అడ్డుపడి, ఎన్నికల్లో గెలుపోదిండు దానం నాగేందర్ అనే వాదన అప్పట్లో ఉండేది. ఆ తదనంతరం విజయ రెడ్డి టిఅర్ఎస్ తీర్థం పూచ్చుకున్నారు. కొడుకు ఇంకా కాంగ్రెస్ లోనే ఉన్నాడు.
2014 ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తరుపున పోటి చేసి దానం నాగేందర్ ఓడిపోయారు. వైసిపి తరఫున పోటీ చేసి విజయారెడ్డి కూడా ఓడిపోయారు. ఈ ఇపుడు కాంగ్రెస్ లో క సామాజీక వర్గం ఆధిపత్య పోరు ఏక్కువ అయిందంటూ దానం టీఅర్ఎస్ పార్టీ కి మారారు. ఇక్కడ దానం విషయం ఏందుకు వచ్చిందంటే ఇక్కడే అసలు తిరకాసుంది…..వచ్చే ఎన్నికల్లో టిఆర్ ఎస్ లో దానం , పిజెఆర్ కూతురు విజయరెడ్డికి పోటీ అవుతున్నారు. 2014 లో ఆయన కాంగ్రెస్ తరుఫున , విజయరెడ్డి వైసిపి తరఫున పోటీ చేశారు. అప్పుడు కాంగ్రెస్ టికెట్ రాకుండా అడ్డుకోవడంతోనే ఆమె వైసిపిలోకి వెళ్లారు. పిజేఅర్ కంచు కోట అయిన ఖైరతాబాద్ నియోజకవర్గంమీద పట్టు సంపాదించేందుకు విజయ రెడ్డి టీఅర్ఎస్ నుండి పోటి చేయడానికి సిద్దంగా ఉంది. కాని దానం టీఅర్ఎస్ లో చేరి, ఆ సీటు మీద కన్నేశాడని టాక్. ఇదే నిజం అయితే పిజేఅర్ కూతురు పరిస్థితి ఏంటి ….? ఇక పిజేఅర్ కుమారుడు 2009 ఏన్నికల్లో గేలిచినా,2014 లో ఓటమి పాలయ్యాడు. మరి వచ్చేఎలక్షన్స్ పార్టీ ఎమ్మేల్యే సీటు దక్కక పోతే… పిజేఅర్ కుటుంబ రాజకీయ జీవితం అంతేనా…? అంటే వచ్చే మార్చి వరకు వేచిచూడాలి.