పవన్ అభిమానులకు రేణూ సూచన

 

రేణూ దేశాయ్ గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ అభిమానులు నన్ను వదిన అంటే బాధగా ఉండదు…ఆనందంగానే ఉంటుంది. కానీ.. పవన్ కళ్యాణ్ భార్యగా భావిస్తూ అంటేనే బాధగా ఉంటుందన్నారు. వదినమ్మ అనే పదం చాలా మంచిదే…కానీ నేను ఇప్పుడు ఆయన భార్యను కాదు కదా..మామూలుగా వదిన అని పిలవండి అని అభిమానులకు రేణూ దేశాయ్ సూచించారు. ఆయన పేరును కలుపుతూ నన్ను వదిన అనడంలోనే ఇబ్బంది ఉందని ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.

రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటున్నారు. కానీ ఆమె పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి పవన్ అభిమానులు ఆమెపై విమర్శలు చేశారు. మరికొంత మంది అభిమానులు ఆమెకు మద్దతు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు కూడా రేణూను కొంతమంది అభిమానులు వదిన అని పిలుస్తున్నారు. దీంతో రేణూ… పవన్ అభిమానులు ఇంకా తనను పవన్ భార్యగా భావించి వదిన అని పిలుస్తున్నారని.. అలా పిలవొద్దన్నారు. మాములుగా వదిన అంటే తనకు సంతోషమేనన్నారు. పవన్ భార్యగా వదిన అని పిలుస్తే తనకు బాధగా ఉంటుందన్నారు. నేను ఇప్పుడు పవన్ భార్యను కాదని గుర్తుపెట్టుకోవాలన్నారు.