తెలుగురాష్ట్రాల్లో కోవిడ్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవ్వడం సామూహిక వ్యాప్తి వల్లే అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఇది ఎంతో ప్రమాదకరమైన సంకేతం కావడంతో ప్రభుత్వాలు వీలైనంత ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నాయి.
గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే.. కొత్తగా 56 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 813కు చేరింది. కొత్తగా కర్నూలు, గుంటూరులో 19, చిత్తూరు 6, కడపలో 5, కృష్ణా 3, ప్రకాశంలో 4 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా వల్ల ఇద్దరు చనిపోయారు. మొత్తంగా ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతిచెందగా.. ఆసుపత్రుల నుంచి 120 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణలోనూ కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా సూర్యాపేటలో 26 కేసులు నమోదయ్యాయి. తాజా పాజిటివ్ కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కి చేరింది. ఇప్పటి వరకు 23 మంది మరణించారు. కేసులు పెరగడం, చిన్నారులు సైతం ఎక్కువగా కరోనా భారిన పడుతుంటంతో తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్‌ను కఠిన తరం చేసింది. మహారాష్ట్ర వైపు సరిహద్దులను మూసివేసింది. మార్చి చివరి వరకు లాక్ డౌన్ పొడిగించేందుకు నిర్ణయం తీసుకుంది.