ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. ఆయన పదే పదే ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు చాలా బలంగా ఉన్నాకూడా సీఎం జగన్ మాత్రం కొన్ని తప్పులు ఎక్కువగా చేస్తున్నారు. ఆయన పదే పదే ఢిల్లీ వెళ్లడం వెళ్లి కేంద్రం పెద్దలను మాత్రమే కలవడం సంబంధిత అధికారులను కలవకపోవడంతో అసలు ఆయన ఎందుకు వెళ్తున్నారో కూడా చాలామందికి అర్థం కావడం లేదు.
జగన్ ఇప్పటివరకు ఢిల్లీ పర్యటనలో ఒక్కసారి కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్ళలేదు అని ఆరోపణలు కూడా ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రధాని కార్యాలయానికి వెళ్లి పలు శాఖల అధికారులతో కూడా ఆయన చర్చించిన పరిస్థితి లేదు అని చెప్పాలి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో కూడా సంబంధిత అధికారులతో పాటు మంత్రులను కూడా ఆయన కలవలేక పోతున్నారు అని కొంతమంది అంటున్నారు.
హోంమంత్రి అమిత్ షా లేకపోతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటి కావడం మినహా ఆయన మినహా ఏమీ చేయడం లేదని కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు విషయంలో హోంమంత్రిని అడిగితే పెద్దగా ఉపయోగం ఉండదు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ లేకపోతే మరో సంబంధిత మంత్రితో భేటీ అవ్వడం వంటివి చేయాల్సి ఉంది. కానీ ఇవేమీ చేయకుండా ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్లడం రావడం మినహా ఏమీ చేయకపోవడంతో అసలు ఏం జరుగుతుంధో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ పదే పదే జగన్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రజల కాళ్లు పట్టుకున్నారని ఆరోపణలు చేస్తున్న కూడా జగన్ వ్యవహార శైలిలో మాత్రం మార్పు రావడం లేదు.