జూనియర్ ఎన్టీఆర్ అంచనా నిజమైందా ?

తెలంగాణ ఎన్నికల్లో తన అక్క నందమూరి సుహాసిని కూకట్ పల్లి  నియోజగా వర్గం నుంచి పోటీ చేసింది. ఆమె తరుపున జూనియర్ ఎన్టీఆర్ , కళ్యాణ్  రామ ఓ చిన్న ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు.

బాలకృష్ణ , చంద్ర బాబు విస్తుతంగా ప్రచారం చేశారు. ఆ తరువాత జూనియర్ ప్రచారానికి వస్తాడని బాలకృష్ణ ఒకానొక సందర్భంలో చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ తాను రాక పోగా కళ్యాణ్ రామ్ కూడా రానీయ లేదు . దీని వెనుక వున్న కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది .

జూనియర్ కు కేటీఆర్ ఫోన్ చేసి ప్రచారానికి రావద్దని, చంద్ర బాబు ,  ట్రాప్ లో పద వద్దని, వచ్చేది టీఆరెస్ ప్రభుత్వమేనని చెప్పాడట .

అందుకే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాలేదని తెలిసింది . తానూ హైద్రాబాద్లో ఉంటున్నాడు . కేటీఆర్  తనకు  మంచి  స్నేహితుడు , ప్రచారానికి వెళ్లి అతని స్నేహానికి దూరం కావడం , తెలంగాణ ప్రజల దృష్టిలో ఓ పార్టీకి ప్రచారం చేశాననే  అపవాదు ఎందుకనే ఉద్దేశ్యంతోనే ప్రచారం చెయ్యలేదని తెలిసింది. సుహాసిని కూడా ఓటమికి దగ్గరలో వున్నారు. ఏమైనా జూనియర్ ఎన్టీఆర్  మంచి నిర్ణయం తీసుకున్నాడు .