గ్రేటర్ హైద్రాబాద్ మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసాయి, దాంతో పాటు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ టీ ఆర్ ఎస్ గెలుపొందిన విషయం విదితమే. ఇప్పటికే పలు మున్సిపాల్టీలకు సంబందించిన చైర్మన్ ల ఎన్నిక కూడా జరిగింది. అయితే ప్రతిష్టాత్మక హైద్రాబాద్ నగర మేయర్ గా ఎవరిని ఎన్నుకుంటారో అన్న విషయం పై ముందునుండే ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి నగర మేయర్ గా మహిళకే రిజర్వేషన్ లభించింది. దాంతో గ్రేటర్ మేయర్ పదవికోసం ఇప్పటికే పలువురు టీఆర్ ఎస్ నాయకులూ మహిళలను బరిలోకి దింపేందుకు సిద్ధం అవుతున్నారు.
అధికార పార్టీ త్వరలోనే నగర పాలక మండలిని ఏర్పాటు చేయడానికి సిద్ధం అయింది. దాంతో పాటు గ్రేటర్ తో పాటు శివారు మున్సిపాటిలిటీలు, కార్పొరేషన్స్ లో కూడా మహిళల ఆధిక్యత ఉండనుంది. మరి ఈ సారి మేయర్ భరిలో నిలిచి, గెలిచే మహిళా అభ్యర్థి ఎవరో చూడాలి.