ఇంకెప్పుడు పవన్ నువ్వు  రాజకీయం చేసేది ?

కరోనా వైరస్ పవన్ కళ్యాణ్ కి పెద్ద తలనెప్పి తెచ్చి పెట్టింది. కరోనా దెబ్బకు ఆయన ప్రణాళిక మొత్తం తారుమారైంది. పవన్ రాజకీయాలలో సీరియస్ గా కొనసాగుతూనే,  ఆర్థిక అవసరాల కోసం సినిమాలలోకి కూడా రీఎంట్రీ ఇచ్చారు. మరి ఆర్థిక అవసరాలు ఎంతవరకు తీరాయో గాని,  ప్రత్యర్ధులు మాత్రం,  పవన్ సినిమాలు చేయడం  ఆసరాగా చేసుకొని..  కొన్నాళ్లు నుండి   విమర్శల దోస్ పెంచుకుంటూ  పోతున్నారు.  

అయినా ప్రజా సేవకే జీవితం అంకితమని భారీ డైలాగ్స్ చెప్పి… పవన్ ముఖానికి రంగేసుకుని..పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని నిజంగానే నిరూపించుకున్నట్లు అయిందా ? పైగా  పవన్ నిర్ణయం వలన సొంత పార్టీ నేతలలోనే వ్యతిరేకత చెలరేగింది. పవన్ సినిమాలు ఒప్పుకోవడాన్ని సాకుగా చూపి లక్ష్మీ నారాయణ లాంటి కొంతమంది పార్టీ నుండి బయటికి వెళ్లిపోయారు. బట్ పవన్ వైఖరి కూడా మారలేదు.    

తన పార్టీలో నుండి ఎంతమంది  వెళ్ళిపోయినా పార్టీని నడపగల సత్తా తకుందని తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ బండి ఎలాగోలా నేట్టుకోస్తున్నారు.  ఇప్పటికే మూడు సినిమాలు ఒప్పుకున్నారు. అధికారికంగా ప్రకటించిన ఈ మూడు చిత్రాలతో పాటు మరో రెండు చిత్రాలను కూడా వరుసగా చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్ .  

అయితే కరోనా వైరస్ అదుపులోకి వచ్చి సవ్యంగా షూటింగ్ జరిగిన తరుణంలో, అప్పుడు మాత్రమే 2022 కి పవన్ కమిటైన  చిత్రాలన్నీ  పూర్తి చేయగలడు. కానీ మరో సంవత్సరం దాకా సాధారణ పరిస్థితులు వచ్చేలా కనబడటం లేదు. ఆ తరువాత  ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి.  ఇంకెప్పుడు పవన్ పార్టీని పటిష్టం చేసేది ? రాజకీయం చేసేది ?