ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ వర్సెస్ వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే ఇప్పుడు హాట్‌టాపిక్. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఒక చిన్న చర్చతో సమసిపోయే వ్యవహారాన్ని, వైసీపీ ఎమ్మెల్యేలు చాాల ముందుకు తీసుకెళ్ళారు. ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజును, వైసీపీ నేతలు అతిగా వ్యాఖ్యలు చేయడంతో, రఘురామ కృష్ణంరాజు ఏకంగా, ఆ పార్టీలో జరుగుతున్న అక్రమాలను బయటపెట్టడం సంచలనంగా మారింది.
దీంతో వైసీపీ కోటరీని టార్గెట్ చేసిన రఘురామ కృష్ణంరాజు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ క్రమంలో ఇంతకాలం తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణలను, ఏకంగా వైసీపీ ఎంపీనే దృవీకరించడంతో, టీడీపీ చేస్తున్న ఆరోపణలు అన్నిటికి ఎంపీ రఘురామరాజు ఆధారాలు ఇచ్చినట్టయ్యింది. ఈ క్రమలో ఇంతకాలం తెలుగుదేశం పార్టీ చెప్పినవన్నీ పచ్చి నిజాలే అని రాష్ట్ర ప్రజులు నమ్మే పరిస్థితి వచ్చిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
ఇక తమపై అవినీతి ఆరోపణలు చేయడంతో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజును లక్ష్యంగా చేసుకుని వైసీపీ నియోజకవర్గాల వారీగా తమ పార్టీ నేతలను రంగంలోకి దింపడమే కాకుండా, జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేయించారు. అంతే కాకుండా పలుచోట్ల వైసీపీ ఎమ్మెల్యేల అనుచరులు రఘురామ కృష్ణంరాజు దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ వ్యవహారమంతా ఆ పార్టీ అధినేత జగన్‌కు తెలియకుండా జరిగాయంటే ఎవరూ అంగీకరించరు. ఈ క్రమంలో రఘురామ కృష్ణంరాజు వర్గం వ్యూహాత్మకంగా వైసీపీ ఎమ్మెల్యేల పై కేసులు పెట్టింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఎంత దూరం వెళుతుందో చూడాలి.