ఆర్టీసీ ఎంప్లాయిస్ ఫుల్లు హ్యాపీ

ఇక నుండి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 2 ఏళ్ళు పెరిగింది. ఇప్పటి వరకూ 58 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగ విరమణ వయసును జగన్ రెండేళ్ళు పెంచి అంటే 60 ఏళ్ళు చేశారు. జగన్ తాజా నిర్ణయం వల్ల సంస్ధలో పనిచేసే 52 వేల మంది లబ్దిపొందబోతున్నారు. నిర్ణయం తీసుకున్ని సుమారు పది రోజుల క్రితం. ఉత్తర్వులు జారీ అయ్యింది సోమవారం.

అంటే ఈ పదిరోజుల్లో రిటైర్ కావాల్సిన సుమారు 550 మందికి కూడా ఇదే ఉత్తర్వులు వర్తిస్తుందని జగన్ ఇది వరకే డిసైడ్ అవ్వటంతో వారు కూడా లబ్దిపొందారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో  విలీనం చేయటమే చాలా పెద్ద లబ్దిగా చెప్పాలి. ఎందుకంటే సంస్ధను ప్రభుత్వంలో విలీనం చేయాలని దశాబ్దాలుగా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.

గతంలో ఏ ప్రభుత్వం కూడా విలీనం దిశగా కనీసం ఆలోచన కూడా చేయలేదు. అంతెందుకు చంద్రబాబునాయుడు కూడా విలీనం చేస్తానని ఎన్నోసార్లు హామీని ఇచ్చారే కానీ ఎప్పుడు అమలుకు ప్రయత్నించలేదు. కానీ మొన్నటి పాదయాత్ర సందర్భంగా జగన్ ఈ విషయమై హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులను విలీనం చేసేశారు.

ఆర్టీసిని విలీనం చేయాలంటే సాంకేతిక సమస్యలు ఉన్న కారణంగా ఉద్యోగులను మాత్రం  విలీనం చేసిన జగన్ తాజాగా ఉద్యోగ విరమణ వయసును కూడా రెండేళ్ళు పెంచటంతో వేలాది ఉద్యోగులు పిచ్చ హ్యాపీగా ఉన్నారు. ఆ ఉత్తర్వులు కూడా దసరా పండుగ సందర్భంగా జారీ అవటంతో మరింత హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి.