అమరావతి ఉద్యమం తీవ్రరూపం దాల్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే దాదాపు 45 రోజులుగా దీక్ష చేపట్టిన రైతులు ఈ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని కలిశారు. రైతులతో పాటు జె ఏ సి నేతలు కలిసి తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పిర్యాదు చేశారు. ఈ విషయంలో కేంద్ర తప్పకుండా జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి లో పేర్కొన్నారు. మొత్తానికి అమరావతి రైతులు తమ ఉద్యమాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లారు. గత రెండు మూడు రోజులుగా వారు ఢిల్లీలోనే పర్యటిస్తూ ఈ రోజు ఉపరాష్ట్రపతి ని కలిసి తమ గోడు విన్నవించుకున్నారు.
రాజధాని కోసం భూములు ఇచ్చిన తమపై తప్పుకు కేసులు పెట్టి వేధిస్తున్నారని, పోలీసులు దాడులు చేస్తున్నారంటూ, దయచేసి వాటిని ఆపాలంటూ కోరుకున్నారు. తమ పోరాటం శాంతియుతంగానే ఉందని, కానీ పోలీసులే దౌర్జ్యన్యం చేస్తున్నారని వారు పిర్యాదు చేసారు. పోలిసుల అత్యుత్సాహం ఎక్కువైందని, వారి దాడులనుండి ప్రజలను కాపాడాలని పేర్కొన్నారు. అమరావతి నుండి రాజధానిని తరలించకుండా చూడాలని ఉపరాష్ట్రపతి ని కోరారు. వెంకయ్య నాయుడితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసారు రైతులు, జె ఏ సి నేతలు. జగన్ ప్రభుత్వం పై పలు పిర్యాదులు చేసారు. ప్రధాని, రాష్ట్రపతి ల అపాయింట్మెంట్ కావాలని కోరారు. వారు పర్మిషన్ ఇస్తే తమ సమస్యలను వివరిస్తామని అన్నారు.
ఎపి ప్రభుత్వం తీరుపై రైతులు, జె ఏ సి నేతలు పలు పిర్యాదులు చేస్తున్నారు. దాదాపు 50 రోజులకు పైగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా కూడా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని, రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉండాలని, అది అమరావతి మాత్రమే కావాలని వారు కోరుతున్నారు. అమరావతి విషయంలో రాబోయే రోజుల్లో ఉద్యమం ఉదృతం చేస్తామని ప్రకటించారు.