సుధీర్ స్థానంలో స్టార్ హీరో ఉంటే ఇలాగే మాట్లాడుతారా డైరెక్టర్ గారు?

టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గురించి తెలియని వారంటూ ఉండరు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ హిట్ గా నిలిచాయి. ఇటీవల రాఘవేంద్రరావు సమర్పణలో మరొక చిత్రం తెరకెక్కింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ కమెడియన్లందరూ ఈ సినిమాలో కనిపించనున్నారు. రాఘవేంద్రరావు సమర్పణలో శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శక‌త్వంలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో అనసూయ, బ్రహ్మానందం, సుధీర్, సునీల్ , శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, సప్తగిరి వంటి ప్రముఖ కమెడియన్లు ప్రధాన పాత్రలలో నటించారు.

ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమయ్యింది. ఆగస్టు 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులం ముందుకి రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమా యూనిట్ బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేకం టీవీ షోస్ లో సందడి చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఈ సినిమా యూనిట్ క్యాష్ షోలో సందడి చేసింది. ఇదిలా ఉండగా ఇటీవల వాంటెడ్ పండుగాడ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా నిర్వహించారు.

ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో సుధీర్ అభిమానుల మీద రాఘవేంద్రరావు మండిపడ్డాడు. అయితే అందుకు కారణం కూడా లేకపోలేదు. రాఘవేంద్రరావు మాట్లాడుతున్న సమయంలో సుధీర్ అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ గోల చేయటంతో రాఘవేంద్రరావు తీవ్ర అగ్రహానికి గురై సుధీర్ అభిమానులు
నొచ్చుకునేలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఈవెంట్లో అల్లరి చేయకుండా ఉంటే ఉండండి లేదంటే వెళ్లిపొండి. మళ్లీ ఇక్కడికి ఎవరు ఆహ్వానించారు. చిన్న, పెద్ద అన్న మర్యాద కూడా తెలియదా? గోల చేయడం ఆపకపోతే ఇక్కడినుండి బయటకి గెంటేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చాడు. అయితే రాఘవేంద్రరావు చేసిన వ్యాఖ్యలపై సుధీర్ అభిమానులు మండిపడుతున్నారు. సుధీర్ స్థానంలో ఏ సూపర్ స్టార్ హీరో ఉంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మాట్లాడతారా రాఘవేంద్ర రావు అంటూ ప్రశ్నిస్తున్నారు.