అనసూయ నన్ను పెళ్లి చేసుకోవా…రిక్వెస్ట్ చేసిన నెటిజన్.. అనసూయ రియాక్షన్ ఇదే?

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఈమెకు వచ్చిన పాపులారిటీతో సినిమా అవకాశాలను అందుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉండటం వల్ల ఈమెకు జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో కష్టతరంగా మారుతుందని ఏకంగా జబర్దస్త్ కార్యక్రమానికి గుడ్ బై చెప్పారు. జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నటువంటి అనసూయ పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

ఈ విధంగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు.ఇలా సోషల్ మీడియా వేదికగా అనసూయ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈమె చేసిన కామెంట్స్ వల్ల తీవ్రస్థాయిలో వివాదాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ అనసూయ తన గురించి విమర్శలు చేసిన వారికి తనదైన స్టైల్ లో సమాధానం చెబుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు.

అభిమానులు అడిగే ప్రశ్నలకు ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ ఉన్నారు. అయితే ఈ సెషన్ లో భాగంగా ఓ అభిమాని మాత్రం ఎవరు ఊహించని విధంగా అనసూయను ప్రశ్నించారు.ఈ క్రమంలోనే అనసూయను ప్రశ్నిస్తూ ఎన్ని సార్లు నన్ను పెళ్లి చేసుకోమని ఎన్నిసార్లు అడగాలి అసలు ఈ విషయంపై ఏ మాత్రం స్పందించలేదు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్న విన్నటువంటి అనసూయ ఒక్కసారిగా షాక్ అయింది.ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉన్నటువంటి ఒక ఎమోజిని షేర్ చేశారు. అలాగే తాను ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్న ఫోటోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగినటువంటి ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.