డాక్టర్ బాబుని హిమ ఏంటి అలా పిలుస్తుంది.. మరి దారుణం కదా!

మాటీవీలో కొన్ని సంవత్సరాలుగా ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రేక్షక ఆదరణ పొందిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ సీరియల్ లో దీప, కార్తీక్, హిమ, శౌర్య, మోనిత పాత్రలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే కొంతకాలంగా కార్తీక్ దీప పాత్రలు చనిపోవడంతో వారిని సీరియల్ నుండి తొలగించారు. అంతేకాకుండా హిమ శౌర్య పాత్రలను పెద్దవాళ్లను చేసి కొత్తవారితో సీరియల్ కొనసాగిస్తున్నారు. ఇలా దీపా కార్తీక్ మౌనిత వంటి వారు ఈ సీరియల్ లో కనిపించకపోవడంతో సీరియల్ చూసే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోయి రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. అందువల్ల సీరియల్ రేటింగ్స్ పెంచడానికి దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అందువల్ల డాక్టర్ బాబు, వంటలక్క, హిమ, శౌర్య పాత్రలను మళ్లీ ఈ సీరియల్ లో తీసుకువచ్చారు. ఈ సీరియల్ కథ ప్రస్తుతం గతంలోకి వెళ్లింది. ఆ చిన్న పిల్లలు శౌర్య, హిమలు, దీప, కార్తీక్ మధ్య కథ నడుస్తోంది. దీంతో ఈ సీరియల్ రేటింగ్స్ బాగా పెరిగాయి. ఇదిలా ఉండగా సీరియల్ లో కలిసినటించే వారు బయట కూడా ఎంతో క్లోజ్ గా ఉంటారు. ఇలా శౌర్య, హిమ కూడా డాక్టర్ బాబు , వంటలక్క తో ఎంతో చనువుగా ఉంటారు. అయితే సీరియల్ లో డాక్టర్ బాబు ని నాన్న అని పిలిచే హిమ బయట మాత్రం అన్నయ్య అంటూ పిలుస్తోంది.

సాధారణంగా సీరియల్ లో నటించే వారు ఆన్ స్క్రీన్‌లో ఎలాంటి రిలేషన్ ఉంటే.. బయట కూడా అలానే పిలుస్తుంటారు. కానీ మన హిమ మాత్రం డాక్టర్ బాబు నాన్న అని పిలవడం లేదు. అవునండీ.. ఇటీవల డాక్టర్ బాబు ( నిరుపమ్) ఆగస్టు 17 న తన పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అందరూ డాక్టర్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ క్రమంలో వంతలక్క , మోనిత, శౌర్య కూడా బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు వేశారు. ఇక ఈ సందర్భంగా హిమ కూడా ఓ పోస్ట్ షేర్ చేసింది. హ్యాపీ బర్త్ డే అన్నయ్య అంటూ డాక్టర్ బాబు కి బర్త్ డే విషెస్ తెలియచేసింది. అయితే ఇలా అన్నయ్య అని పిలవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.