సాధారణంగా బిగ్ బాస్ కార్యక్రమం కోసం ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని లేదంటే బిగ్ బాస్ ద్వారా బాగా ఫేమస్ అయ్యి ఇండస్ట్రీలో అవకాశాలను పొందడం కోసం ఎంతోమంది కంటెస్టెంట్ లో ఈ కార్యక్రమానికి రావాలని ఆసక్తి చూపిస్తారు.అయితే ఆరవ సీజన్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ ను నాగార్జున బిగ్ బాస్ హౌస్ లోకి రావడం వెనుక కారణం అడగగా ప్రతి ఒక్కరు తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి అని అలాగే టైటిల్ గెలవడం కోసం వచ్చామంటూ రీజన్స్ చెప్పారు.
ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి నాలుగవ కంటెస్టెంట్ గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు నేహా శర్మ. ఈమె స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి రావడం వల్ల ఈమె ఏకంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు యాంకర్ గా వ్యవహరించారు. అలాగే పలు బుల్లితెర కార్యక్రమాలపై కూడా సందడి చేశారు.ఇలా నటిగా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నేహా శర్మ రారా రక్కమ్మ అనే పాట ద్వారా బిగ్ బాస్ వేదికపైకి ఎంట్రీ ఇచ్చారు.
ఈ విధంగా నేహా శర్మ వేదిక పైకి రాగానే నాగార్జున తనతో మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ కి రావడానికి గల కారణం ఏంటి అని ప్రశ్నించారు.ఈ క్రమంలోనే నేహా శర్మ మాట్లాడుతూ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయని తన తల్లి పెళ్లి చేసుకోమని చాలా ఒత్తిడి తెస్తుందంటూ తెలిపారు. అయితే ఇలా పెళ్లి గురించి ప్రస్తావన వస్తున్న సమయంలోనే తనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఆ పెళ్లి తప్పించుకోవడం కోసమే బిగ్ బాస్ కార్యక్రమానికి వచ్చానని చెబుతూ షాక్ ఇచ్చారు.ఏది ఏమైనా పెళ్లి తప్పించుకోవడం కోసం బిగ్ బాస్ కి వచ్చానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.