చిన్నప్పుడే అమ్మా నాన్నలు దూరమయ్యారు..కూలీ పనులకు వెళ్లేదాన్ని: బిగ్ బాస్ అరోహి

బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారం అవుతుంది. ఇక ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి ఆరోహి అలియాస్ అంజలి గురించి అందరికీ తెలిసిందే.న్యూస్ రీడర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లే ముందు ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కన్నీటి కష్టాలను తెలియజేశారు.

ఇంటర్వ్యూలో భాగంగా అరోహి మాట్లాడుతూ తాను ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే తన తల్లి చనిపోయిందని తన తండ్రి వేరే ఆవిడను పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో తాను తన అమ్మమ్మ దగ్గరే పెరిగానని ఈమె వెల్లడించారు.ఇలా అమ్మమ్మ దగ్గర పెరుగుతూ కూలి పనులకు వెళ్లి చదువుకున్నాను అయితే ఆర్థిక స్తోమత లేనందువలన చదువు మధ్యలోనే ఆపేశానని ఆరోహి వెల్లడించారు. నటనపై ఆసక్తితో ముందుగా లోకల్ ఛానల్ లో పనిచేశానని నెలకు 4000 జీతం ఇచ్చేవారని తెలిపారు.

ఇకపోతే అక్కడే ఉంటే తన జీవితం ఆగిపోతుందని ఉద్దేశంతో తాను హైదరాబాద్ కి వచ్చానని ప్రస్తుతం ఒక న్యూస్ ఛానల్లో యాంకర్ గా పనిచేయడంతో జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ మూడు సంవత్సరాల నుంచి నా జీవితం కాస్త ప్రశాంతంగా ఉందని ఈమె వెల్లడించారు.ఈ మూడు సంవత్సరాల ముందు నా జీవితంలో రేపు ఎలా అనే విషయం గుర్తుకు వస్తే కన్నీళ్లు వచ్చేవని నేను ఏడవని రోజు అంటూ లేదంటూ ఈ సందర్భంగా ఈమె తన కన్నీటి కష్టాలను తెలియజేశారు.