దేవయానికి అల్టిమేట్ షాక్ ఇచ్చిన వసుధార…. వసు నిర్ణయంతో సంతోషంలో రిషి!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది. ఈ క్రమంలోని నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే వసుధార ఇంటికి వెళ్లి తన పెళ్లి సంబంధం చెడగొట్టాలని దేవయాని ప్లాన్ చేస్తూ వసుధార భావతో ఫోన్ మాట్లాడుతుంది. అయితే ఇది విన్నటువంటి మహేంద్ర వదిన గారు ఈ టైం లో ఫోన్ ఏంటి అనడంతో ఒక్కసారిగా దేవయాని షాక్ అవుతుంది. ఏదో ఒక అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరుసటి రోజు ఉదయం ఫణీంద్ర మహేంద్ర అందరూ కూర్చుని మాట్లాడుతుండగా అక్కడికి తయారై వచ్చిన దేవయాని ఏంటి అందరూ ఇక్కడే కూర్చున్నారు. ఇంకా ఎవరు రెడీ కాలేదు వీళ్ళకంటే ఎలాగో బాధ్యత లేదు ఇక అన్ని నేనే దగ్గర ఉండి చూసుకోవాలి కదా అంటూ దేవయాని నాటకం ఆడుతుంది.దీంతో పనింద్ర ఇప్పటికిప్పుడు వసుధార ఇంటికి వెళ్లాలంటే ఎలా అని చెప్పడంతో నేను పంతులు గారితో మాట్లాడాను మంచి ముహూర్తం అని చెప్పారని దేవయాని అంటుంది.

మరోవైపు రిషి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఆ ఫోటోలని వసుధారకు పంపించి ఏది వేసుకోవాలి అని అడుగుతాడు. మీరు ఏది వేసుకున్న బాగుంటారు ఎందుకంటే మీరు ప్రిన్స్ అని మెసేజ్ చేయడంతో అది చూసిన రిషి నవ్వుకుంటాడు.మరోవైపు దేవయాని మహేంద్ర జగతులను ఉద్దేశించి మాట్లాడటంతో ఫణింద్ర నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళని ఆనందే ఉండలేవా అంటూ తిడతాడు. అంతలోపు వసుధార దేవయానికి కాఫీ తీసుకొని వస్తుంది.

దీంతో ఫణిద్ర వసుధర మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పావా మనం వస్తున్నామని అనడంతో దేవయాని ఎందుకు చేసి ఉండదు వసుధార తెలివైన పిల్ల కదా అంటూ తన ముందు నాటకం ఆడుతుంది. మీరు ఇప్పుడు ఎవరు మా ఇంటికి రావాల్సిన పనిలేదు అని అందరికీ షాక్ ఇస్తుంది.నేను ఎలాంటి పరిస్థితులలో ఇంటి నుంచి వచ్చానో మీకు తెలియదు. అందుకే ముందుగా నేను ఇంటికి వెళ్లి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకొని వారికి ఇక్కడ విషయాలన్నీ చెప్పి ఒప్పిస్తానని వసుధార చెబుతుంది.

ఇక దేవయాని మాత్రం తన ప్లాన్ చెడిపోతుందని వెళ్లాలని పట్టుబడుతుంది. దీంతో వసుధారా నేను పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చాను ఇప్పుడు నన్ను చూస్తే మా నాన్న ఏదో ఒకటి అంటారు. ఆయన నన్ను అన్న పర్లేదు కానీ మిమ్మల్ని ఏమీ అనకూడదు అందుకే నేను వెళ్లి మా నాన్నే మిమ్మల్ని పిలిచేలా చేస్తాను అంటూ చెబుతుంది.అందుకు జగతి కూడా వసుధార చెప్పేది నిజమే అనడంతో వెంటనే రిషి కూడా వసుధార మాటలలో నిజం ఉంది ముందు తనని వెళ్ళనివ్వండి అని చెప్పడంతో దేవయాని షాక్ అవుతుంది. అందరూ ఒక్కటయ్యారు అని మనసులో అనుకుంటుంది. మరోవైపు రిషి తనకు జాగ్రత్తలు చెప్పి పంపిస్తాడు ఏం జరిగినా నీ వెనుక నేనున్నాననే విషయం గుర్తుపెట్టుకో వసుధారా అంటూ తనని వాళ్ళ ఊరికి పంపిస్తాడు.