తన ఊరిలోకి అడుగుపెట్టి వసుధార…. జగతి ఇచ్చిన కానుకను వసు చేతిలో పెట్టిన రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎంతో ఆసక్తికరంగా మారింది.నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే వసుధార రిషి ఇద్దరు కూడా తన ఊరికి బయలుదేరుతూ ఉంటారు. మధ్యలో వాటర్ అయిపోవడంతో రిషి కారు ఆపగా వసుధార మాత్రం అక్కడే ఉన్నటువంటి గోలి సోడా తాగడానికి ఇష్టపడుతుంది.అయితే రిషికి గోలి సోడా తాగడం రాకపోవడంతో వసుధార గోలి సోడా ఎలా కొట్టాలి ఎలా తాగాలి అనేది చూపిస్తుంది. దీంతో రిషికి గోలి సోడా నచ్చి మరో రెండు తీసుకుంటారు. అలాగే అక్కడే తాటి తేనెలు ఉండడంతో వాటిని కూడా తీసుకుంటుంది.

దీంతో రిషి ఈ ప్రపంచంలో ఉన్న పండ్లను నాతో తినిపించి తాగిస్తావా వాటి పేర్లు చెబుతుంటేనే నాకు ఆయాసం వస్తుంది వసుధార అంటూ మాట్లాడటంతో వసుధార మాత్రం వాటి ప్రయోజనాలు చెబుతుంది. ఇక వీరిద్దరూ కారులో ప్రయాణిస్తూ ఉండగా వసుధార ఊరు రావడం ప్రారంభమవుతుంది.మరోవైపు దేవయాని మాత్రం రిషి తన మాట కాదన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అదేవిధంగా నా ప్లాన్ వసుధారకు తెలిసిపోయిందా అంత నాకు ఎందుకు రివర్స్ అవుతుంది అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.

అదే సమయంలోనే ధరణి కాఫీ తీసుకు వెళ్లడంతో మొదటిసారి కరెక్ట్ టయానికి తీసుకొచ్చావా అని తాగి ఒక్కసారిగా ఉమస్తుంది.అదేంటిదరిని నాకు టీ తాగాలని ఉంది కాఫీ తెచ్చావు అని అనడంతో మీకు ఏం తాగాలో నాకు ఎలా తెలుస్తుంది అత్తయ్య అంటూ ధరణి మాట్లాడుతుంది. ధరణి ఈ కాఫీ కప్పు కింద పడే లోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ధరణిపై అరుస్తుంది.

ఇక వసుధార ఊరు ఎంటర్ కావడంతోనే వసుధార కారు ఆపమని చెప్పి దిగి వాళ్ళ ఊరి బోర్డు దగ్గర ఇద్దరు సెల్ఫీ దిగుతారు. ఇక తిరిగి వెళుతుండగా సర్ చాలా నెమ్మదిగా వెళ్ళండి నేను మా ఊరిని చూడాలనుకుంటున్నాను అని చెప్పి రిషితో నెమ్మదిగా వెళ్ళమని చెబుతుంది. అంతలోని వసుధార చదివిన కాలేజ్ రావడంతో కారు ఆపమని చెప్పి ఇది నేను చదివిన కాలేజ్ సర్ ఒక్కసారి మా కాలేజ్ చూసి వద్దామని చెప్పి ఇద్దరూ లోపలికి వెళ్తారు. రిషి వసుధార ఇద్దరు కూడా కాలేజీలో కాస్త సమయం గడుపుతారు. అదే సమయంలోనే జగతి రిషికి ఇచ్చినటువంటి మంగళసూత్రం తీసి వసుధార చేతిలో పెడతారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి కానుంది.