ఆది చేసిన పని వల్ల ప్రమాదంలో పడిన వర్ష.. ట్యూబ్ లైట్ తో వర్షపై సాహసం చేసిన ఆది?

ప్రేక్షకులను అల్లరించడానికి ఎన్నో కామెడీ షోలు ప్రసారం అవుతూ ఉంటాయి. ఈ షోస్ లో కామెడీ తో పాటు డాన్సులు చేస్తూ సందడి చేస్తుంటారు. అంతే కాకుండ ప్రేక్షకులని ఆకట్టుకోవటనికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈటీవిలో ప్రసారం అవుతున్న శ్రీదేవీ డ్రామా కంపెనీ షో లో కూడా ప్రేక్షకులని అలరించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వినాయకచవితి సందర్భంగా మన ఊరి దేవుడు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర నటీనటులు కూడా సందడి చేశారు.

ఈ కార్యక్రమంలో జయసుధ , కుష్బూ, ఇంద్రజ, ప్రగతి, నాగినీడు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఇటీవల మన ఊరి దేవుడు ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంద్రజ, రష్మి తన డాన్స్ తో రెచ్చిపోయారు. ఇక ఈ ఈవెంట్ లో అన్నపూర్ణమ్మ పంచ్ లు కూడా మామూలుగా ఉండవు. అంతే కాకుండా ఈ సారి ఈ ఈవెంట్ లో పాల్గొన్న వారి చేత సాహసాలు చేయించారు. ఈ ఈవెంట్ లో భాగంగా కొందరికి అడుక్కునే గెటప్ లు వేయించారు. ఈ ఈవెంట్ లో మరి కొంతమంది చేతుల మీద కారు టైర్లు ఎక్కించుకునని సాహసం చేశారు.

ఇక ఇమాన్యుల్ తో పాటు మరికొందరు బురదలో పోట్లాడుతూ సందడి చేశారు. ఇక ఈ ఈవెంట్ లో ఆది కూడా రెచ్చిపోయాడు. ఈ క్రమంలో ఆది కూడా ట్యూబ్ లైట్ తో సాహసం చేశాడు. ట్యూబ్ లైట్ తీసుకొని వర్ష ని కొట్టడంతో ప్రమాదవశాత్తు అది వర్ష నడుము మీద తగిలి వర్ష గాయపడినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఈవెంట్ లో కర్రసాము చేస్తూ సందడి చేశారు. మొత్తనికి వినాయక చవితి సందర్భంగా మల్లెమాల వారు ప్రేక్షకులని ఆకట్టుకొవటానికి అందరిచేత సాహసాలు చేయించారు. ఇటీవల విడుదలయిన ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది.