హాలీవుడ్ సినిమాని మించిపోయిన అన్ స్టాపబుల్ ప్రోమో.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్?

బాలకృష్ణ నటుడిగా మాత్రమే కాకుండా హోస్ట్ గా కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారు. మొదటి సీజన్ ఎంతో మంచి విజయం అందుకోవడంతోరెండవ సీజన్ మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమోతో పాటు ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుంది అనే విషయాన్ని కూడా ఆహా అధికారకంగా ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఒక హాలీవుడ్ సినిమాని తలపిస్తుంది అనేలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు.

ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ డైలాగులు చెబుతూ…
అంధకార అభయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధి అంటూ ఈ ప్రోమోను కౌబాయ్ తరహా  లెవల్లో తెరకెక్కించారు. ఇక అక్కడ ఎదురయ్యే సవాళ్లు అన్‌ప్రెడిక్టబుల్.. ఆయనఆగని మన పోరాటం అన్ స్టాపబుల్ అంటూ బాలకృష్ణ ఓరేంజ్ లో డైలాగులు చెప్పడం అందరిని ఆకట్టుకుంది.ఈ సారి ప్రశ్నల్లో మరింత ఫైర్.. ఆటల్లో మరింత డేర్.. సరదాల్లో మరింత సెటైర్.. మీ కోసం మరింత రంజుగా.. దెబ్బకు థింకింగ్ మారిపోవాలా అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్స్ సినిమాని తలపిస్తున్నాయి.

ఇక ఈ ప్రోమో చూస్తుంటే రెండవ సీజన్ భారీగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 14వ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమం ప్రేక్షకులను సందడి చేయనుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి మొదటి గెస్ట్ గా ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ బాబు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది.