ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభమై ఈరోజుతో వారం రోజులు గడిచింది. ఇప్పటికే ఈ వారంలో ఎలిమినేషన్ కూడా ఉంటుందని నాగార్జున ప్రకటించాడు. ఈవారం ఎలిమినేషన్ కోసం ఏడుగురు కంటెస్టెంట్లు సెలెక్ట్ అయ్యారు. వారిలో ఒకరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్లలో
శ్రీ సత్య, ఆరోహి రావు, ఇనయా సుల్తానా, రేవంత్, చలాకీ చంటి, అభినయశ్రీ మొత్తం ఏడు మంది నామినేట్ అయ్యారు.
శనివారం అర్ధరాత్రి తో ప్రేక్షకుల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. దీంతో అతి తక్కువ ఓట్లు ఉన్న కంటెస్టెంట్ ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈవారం ఎలిమినేట్ అయ్యే వారిలో ఇనయా సుల్తానా, ఆరోహి రావు, అభినయశ్రీ ముగ్గురికి పేర్లు వినిపిస్తున్నాయి. కానీ బిగ్ బాస్ నుండి లీకైన సమచారం ప్రకారం అభినయశ్రీ అందరికంటే తక్కువ ఓట్లు దక్కించుకోవడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వారం అభినయ శ్రీ బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వస్తుందని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు.
అయితే తాజా సమాచారం ప్రకారం ప్రేక్షకులకు బిగ్ బాస్ యాజమాన్యం వారు పెద్ద ట్విస్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మొదటి వారం ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం తమ నిర్ణయం మార్చుకున్నట్లు సమచారం. కేవలం మూడు రోజుల గేమ్ చూసిన వెంటనే ఒకరిని హౌజ్ నుండి ఎలిమినేట్ చేయడం కరెక్ట్ కాదని భావించిన బిగ్ బాస్ యాజమాన్యం మొదటి వారం ఎలిమినేషన్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఎలిమినేషన్ లో చివరగా ఉన్న అభినయశ్రీ, ఇనయా సుల్తానా ఈ వారం ఎలిమినేషన్ నుండి బయటపడినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో నిజమెంతుందో తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే.