తన ఇంటికి శాశ్వతంగా తిరిగి వచ్చిన తులసి…. షాప్ లో నందు లాస్య?

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే తులసి తన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అవమానాలను ఆలోచించి వాటిని దృష్టిలో పెట్టుకొని నా లక్ష్యాన్ని పక్కనపెట్టి తిరిగిన ఇంటికి వెళ్లడానికి సిద్ధమయ్యానని సామ్రాట్ దగ్గర చెబుతుంది.సామ్రాట్ కూడా మీరు తీసుకున్న ఆలోచన సరైనదే అంటూ తనకు సపోర్ట్ చేయడంతో తులసి తిరిగి తన ఇంటికి వెళ్లడానికి సిద్ధమవుతుంది. అంతలోపే వడ్డీ వ్యాపారి వచ్చి ఇంటి కాగితాలు తన చేతిలోకి తీసుకొని డబ్బు ఇవ్వడానికి సిద్ధమవుతాడు.

ఇల్లు మీ పేరు మీదే ఉంది కదా అని అడగడంతో లాస్య అవును నా పేరు మీదే ఉందని చెబుతాడు అయితే అంతలోపు తులసి అడ్డుకొని ఇల్లు తన పేరుపై లేదు ఉన్నా కూడా అది ఇప్పటివరకు రిజిస్టర్ కాలేదు అని చెప్పడంతో వడ్డీ వ్యాపారి తప్పుడు కాగితాలతో నన్నే మోసం చేయాలని చూస్తారా ఇకపై మీరెవరు కూడా నాకు కనిపించకూడదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.25 సంవత్సరాల పాటు నీతో కాపురం చేసిన తులసి నీకు ఎలా వెన్నుపోటు పొడిచిందో చూడండి అంటూ లాస్య రెచ్చగొడుతుంది. దీంతో నందు ఈ విషయం అంతా మీకు ముందే తెలుసు ఆయన నాకు ఎందుకు చెప్పలేదు అంటూ ఇతర కుటుంబ సభ్యులపై కోపం తెచ్చుకుంటాడు. అలాగే ఇల్లు లాస్య పేరు పై రాసావు మరి ఇప్పుడేంటి ఇలా అని నందు అడగడంతో నేను లాస్య పేరు రాయలేదు అత్తయ్య పేరు రాస్తుంటే ఈమె మోసం చేసి ఇల్లు రాయించుకుంది గుర్తు పెట్టుకోండి నందగోపాల్ గారు అని మాట్లాడుతుంది.

నేను ఇప్పుడే కావాలన్నా అత్తయ్య పేరు మీద రాసిస్తాను అనడంతో అనసూయ వద్దమ్మా ఇల్లు మా పేరు పై ఉంటే వీళ్ళు ఇంటికోసమే మా గొంతు నలిమి చంపుతారని మాట్లాడటంతో కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మిమ్మల్ని చూసుకోవాల్సిందే మేమే కదా అంటూ లాస్య మాట్లాడుతుంది.ఇకపై మీకు అవసరం లేదు ఎందుకంటే నేను ఇక్కడే శాశ్వతంగా ఉండడానికి వచ్చాను అని చెప్పడంతో లాస్య నందు షాక్ అవుతారు.

ఇంటి నుంచి వెళ్లిపోయిన దానివి మరి ఏ మొహం పెట్టుకొని ఇంట్లోకి వచ్చావు అని లాస్య మాట్లాడటంతో ఈ ఇల్లు నాది ఇక్కడ నా వాళ్ళతో కలిసి ఉండే అర్హత నాకు మాత్రమే ఉంది. ఇష్టం లేకపోతే మీరే బయటకు వెళ్లిపోండి అని తులసి మాట్లాడుతుంది.ఇలా తులసి మాట్లాడేసరికి లాస్య కాసేపు తులసితో గొడవ పెట్టుకుంటుంది. అనంతరం నందగోపాల్ ఇంట్లోకి వెళ్లి లగేజ్ సర్దుతూ ఉంటాడు.ఇప్పుడు మనం బయటకు వెళ్ళిపోతే ఎలా మన ఇద్దరికీ సంపాదనలేదు ఇక్కడే ఉంటే ఎలాగోలాగా కాలం గడుస్తుంది అంటూ తనని వెళ్లకుండా అడ్డుకుంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.