వసుధారణ బయటకు పంపిన జగతి…. రిషిని కలుసుకున్న వసుధార!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయానికి వస్తే… రిషి సార్ కోసం వసుధార ఇంటికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి వారందరూ వసుధారపై చాలా కోప్పడతారు.తను రిషి సార్ తో మాట్లాడాలని సార్ ఎక్కడికి వెళ్లారో చెప్పమని వసుధార ప్రాధేయపడినప్పటికీ దేవయాని మహేంద్ర జగతి వసుధారపై కోపం తెచ్చుకొని తనని ఇంటి నుంచి వెళ్ళమని చెబుతారు. అప్పటికి వసుధార వినకపోవడంతో జగతి తనను బయటకు పంపి తన మొహం పై తలుపులు వేస్తుంది.

వసుధార చేసేదేమి లేక బాధపడుతూ అమ్మవారి దగ్గరకు వెళ్లి నన్ను నీ దగ్గరకు రప్పించుకోవడం కోసమే నాకు ఇన్ని కష్టాలు పెడుతున్నావా అమ్మ అంటూ తన మెడలో ఉన్న తాళిని చూసుకుంటుంది.ఇది రిషి సార్ నా మెడలో వేయకపోయినా నా మనసుకు మాత్రం సార్ నా మెడలో వేసినట్టుగానే భావిస్తున్నాను సార్ ఎక్కడికి వెళ్లారు అని బాధపడుతూ ఉండగా మరో వైపు రిషి అసలు ఈ వసుధార ఏం చేస్తోంది.. ఎందుకిలా ప్రవర్తిస్తుంది అంటూ తన గురించి ఆలోచిస్తూ అమ్మవారి వద్దకు వస్తాడు. అయితే అక్కడ వసుధార ఉండడం చూసి వెనక్కు తిరిగి వెళ్ళిపోతుండగా రిషిను ఆపుతుంది. రిషి వచ్చి అమ్మవారికి మొక్కుకొని వెళ్లబోతూ ఉండగా పూలు అమ్మే ఆవిడ వచ్చి బాబు గుర్తున్నారా అమ్మాయి కూడా వచ్చిందా మీతో పాటు అంటూ తనకు పువ్వులు ఇస్తుంది. రిషి ఆ పువ్వులు తీసుకువెళ్లి అమ్మవారికి పెట్టమని ఇస్తాడు.

ఇక వసుధార తన పెళ్లి గురించి చెప్పే ప్రయత్నం చేయగా రిషి మాత్రం వినిపించుకోడు. నీ పెళ్లి గురించి నాకు ఏమీ చెప్పద్దు అంటూ కోప్పడతాడు. రిషి వసుధారను కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోగా వసుధార మాత్రం రిషి ఇచ్చిన పువ్వులను చూసుకుంటూ రోడ్డుపై నడుస్తూ వెళుతుంటుంది. తనకు ఎదురుగా బస్సు వస్తున్న గమనించని పరధ్యానంలో ఉన్నటువంటి వసుధారణ రీషి కాపాడుతూ చూసుకోవాలి కదా అంటూ తనకోసం క్యాబ్ బుక్ చేస్తాడు.

నీకోసం క్యాబ్ బుక్ చేశాను నువ్వు ఎక్కడికి వెళ్లాలో వెళ్ళిపో అని చెప్పగా చేసేదేమీ లేక గమ్మున ఉండిపోతుంది. మరోవైపు చక్రపాణి సుమిత్రకు కాఫీ అందించడమే కాకుండా ఇంటి పనులు అన్నీ చేస్తూ ఉంటాడు దాంతో సుమిత్ర సంతోషపడుతుంది. ఇక సుమిత్ర వసుధారకు ఫోన్ చేయగా తన ఆరోగ్యం గురించి చెప్పడమే కాకుండా తన తండ్రి మార్పు గురించి కూడా చెప్పడంతో వసుదారా సంతోషపడుతుంది.