ఫైమాలో అప్పుడు ఉన్న ఫైర్ ఇప్పుడు లేదా.. అందుకే ఇలా చేస్తున్నారా?

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలో కమెడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా జబర్దస్త్ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన వారిలో ఫైమా కూడా ఒకరు. పటాస్ షో ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఫైమా ఆ షోలో తన కామెడీ పంచులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా పటాస్ షో ద్వారా ఫేమస్ అయిన ఫైమా జబర్దస్త్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఇలా బుల్లెట్ భాస్కర్ టీం మెంబెర్ గా జబర్దస్త్ లో అడుగుపెట్టిన ఫైమా.. తనదైన శైలిలో పంచులు, సెటైర్లు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయింది.

ఇలా జబర్దస్త్ లేడీ కమెడియన్ గా గుర్తింపు పొందిన ఫైమా బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఫైమా చంటి ఉన్నంతకాలం కామెడీ చేస్తూ హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసింది. అయితే బిగ్ హౌస్ లో కంటెస్టెంట్ మధ్య పోటీ పెరగటంతో ఫైమా కూడా ఆటపై దృష్టి పెట్టి కామెడీ చేయటం పూర్తిగా తగ్గించేసింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లలో తన సత్తా చాటుతున్న ఫైమా.. కామెడీ విషయంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిందని ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.

జబర్దస్త్ లో కామెడీ చేస్తున్నప్పుడు ఫైమాలో ఉండే ఫైర్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు లేదని ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఫైమా అంటేనే ఆమె వేసే పంచులు సెటైర్లే అందరికీ గుర్తుకు వస్తాయి. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత ఒత్తిడి కారణంగా ఆమెలోని కామెడీ యాంగిల్ పూర్తిగా దెబ్బతింది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఫైమా మళ్లీ జబర్దస్త్‌ లో కనిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ టైటిల్ కూడా దక్కించుకోవాలని కూడా ఆశపడుతున్నారు.