అందుకే గాడ్ ఫాదర్ ప్రమోషన్లకు దూరంగా ఉన్నా: అనసూయ

మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమా మలయాళ లూసిఫర్ చిత్రానికి రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయదశమి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి.ఇకపోతే ఈ సినిమాలో ఎంతోమంది నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ క్రమంలోనే బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ కూడా ఈ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో అనసూయ పాత్రనిడివి తక్కువగా ఉన్నప్పటికీ ఒక పవర్ ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో ఈమె సందడి చేశారు. ఈ సినిమా చూసిన అనంతరం అనసూయ పాత్ర పట్ల ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ ఈ సినిమాలో మీరు నటించిన పాత్ర నాకు ఎంతగానో నచ్చింది. ఇలాంటి అద్భుతమైన పాత్రలో నటించిన మీరు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ అసలు విషయం వెల్లడించారు.

ఈ విధంగా నేటిజన్ అడిగిన ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ.. తాను వరుస సినిమా షూటింగ్లలో పాల్గొంటూ బిజీగా ఉందని నిత్యం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నామంటూ ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఎందుకు ఉన్నారో తెలియజేశారు. వరుస సినిమా షూటింగుల కారణంగానే తాను ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొనలేకపోయానని అనసూయ ఈ సందర్భంగా వెల్లడించారు.