13 వ వారంలో ఎలిమినేట్ అయిన టేస్టీ తేజ.. అతని రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకి చేరుకుంది. సక్సెస్ఫుల్ గా 13 వారాలు కంప్లీట్ చేసుకుంది. 13 వారాలుగా కొనసాగుతున్న ఈ గేమ్ షోలో అనూహ్యంగా ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 13వ వారం హౌస్ లో కంటెస్టెంట్ల మధ్య టిక్కెట్ ఫినాలే టాస్క్ ని నిర్వహించగా ముక్కు అవినాష్ ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి రాక తప్పలేదు.

బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో కూడా టేస్టీ తేజ పార్టిసిపేట్ చేశాడు. అయితే అక్కడ ఫైనల్ వరకు చేరుకోలేకపోయాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఏంటి ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన టేస్టీ తేజ అనూహ్యంగా 13వ వారం బయటికి వచ్చేసాడు. అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తన తల్లిని బిగ్ బాస్ హౌస్ లో చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోయాడు.

సీజన్ 8 లో మాత్రం తన తల్లిని బిగ్ బాస్ హౌస్ కి తల్లిని తీసుకువచ్చి ఆమె కోరిక తీర్చాడు. ఇక ఈ సీజన్లో టేస్టీ తేజ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్టోబర్ 6న వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన తేజ దాదాపు హౌస్ లో 8 వారాలపాటు ఉన్నాడు. అతనికి వారానికి నాలుగు లక్షల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

అంటే టేస్టీ తేజ రెండు నెలలలో 30 లక్షల భారీ పారిదోషకం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే టేస్టీ తేజ ఏడవ సీజన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు 9 వారాలపాటు ఉన్నప్పటికీ కేవలం 13 లక్షల 50 వేల రూపాయల మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు బిగ్బాస్ 8 లో ఎవరు విన్ అవుతారు అనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. ఏం జరుగుతుందో చూడాలి మరి.