సురేఖ వాణి ఏంటి ఇది..ఏకంగా ఆ హీరోకి వంద ముద్దులు ఇస్తానంటున్న నటి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఎన్నో సినిమాలలో తల్లి వదిన అక్క పిన్ని పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఈ విధంగా సినిమాల పరంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సురేఖ వాణి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తన కూతురు సుప్రీతతో కలిసి పొట్టి దుస్తులు ధరించి పబ్బులు పార్టీలు పెద్ద ఎత్తున సందడి చేస్తుంటారు.

ఇకపోతే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ తల్లి కూతుర్లు ఆసక్తికరమైన వ్యాఖ్యలను చేశారు.సురేఖ వాణి కూతురు తన తల్లి ప్రేమతో పెళ్లి చేస్తానంటూ చెప్పగా ఈమె మాత్రం తనకు బాయ్ ఫ్రెండ్ మాత్రమే చాలు అంటూ కామెంట్ చేశారు. చెప్పడమే కాకుండా తనకు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా చెబుతూ ఈమె వార్తలలో నిలిచారు.ఇకపోతే తాజాగా సురేఖ వాణి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి మీరు వంద ముద్దులు ఇస్తారు అని ప్రశ్నించగా ఈమె ఒక క్షణం ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు.

తను పవన్ కళ్యాణ్ కు 100 ముద్దులు ఇస్తానని చెబుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ పై సురేఖవాణి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ ఇదేంటి సురేఖవాణి మరి ఇంతలా రెచ్చిపోతున్నారు… కాస్త తగ్గండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. చెప్పినప్పటికీ సురేఖ వాణి మాత్రం తగ్గేదేలే అన్నట్టు ఈమె రెచ్చిపోతూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.