బిగ్ బాస్ సీజన్ 6 లో సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అందుకే బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారా?

జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా గుర్తింపు పొందిన సుడిగాలి సుదీర్ బుల్లితెర సూపర్ స్టార్ గా గుర్తింపు పొందాడు. జబర్ధస్త్ కమెడియన్ గా ఫేమస్ అయిన సుధీర్ సినిమాలలో కూడా నటించే అవకాశాలు అందుకున్నాడు. ఇలా సుధీర్ కమెడియన్ గా మాత్రమే కాకుండా హీరోగా కూడా పలు సినిమాలలో నటించాడు. అయితే సుధీర్ హీరోగా నటించిన సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అయితే సుధీర్ సినిమా అవకాశాల కోసం జబర్దస్త్ కి దూరమయ్యాడు.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు మాటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కొంతకాలం సందడి చేశాడు. గత కొన్ని రోజులుగా మాటీవీలో కూడా సుధీర్ ఎక్కడ కనిపించడం లేదు. స్టార్ మా ఛానల్ వారు అధిక రేమ్యూనరేషన్ ఆశ చూపించి అతనికోసం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి సుధీర్ ని జబర్దస్త్ కి దూరం చేశారు. అయితే ఇపుడు సుధీర్ చేతిలో ఒక్క టీవి షో కూడా లేదు. దీంతో సుధీర్ జబర్థస్త్ కి తిరిగి రాలేక ఇబ్బందిపడుతున్నట్లూ తెలుస్తోంది.

అయితే ఈ సమయంలో మా టీవీ వారు సుధీర్ కి బిగ్ బాస్ సీజన్ 6 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌజ్ లోకి వెళ్ళే అవకాశం కల్పించారని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. దీంతో ఖాళీగా ఉండలేక సుధీర్ కూడా బిగ్ బాస్ కి వెళ్లి తన ఇమేజ్ మరింత పెంచుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సుధీర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. బయట సుధీర్ కి ఉన్న పాపులారిటీని బట్టి బిగ్ బాస్ యాజమాన్యం వారు సుధీర్ కి అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. తొందర్లోనే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించనున్నారు.