బుల్లితెరపై ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి.ఈ రియాలిటీ షో ఇప్పటికే పలు భాషలలో ఎన్నో సీజన్లను పూర్తిచేసుకుని ఎంతో విజయవంతం కాగా తెలుగులో ఈ కార్యక్రమం ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం అవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఏ స్థాయిలో అయితే ఆదరణ లభిస్తుందో అంతకుమించి విమర్శలు కూడా ఎదురవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమం పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా సమాజానికి ఎలాంటి ఉపయోగము లేదని ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో సంతోషంగా ఉన్నవారు కూడా శత్రువులుగా మారిపోయారు అంటూ కొందరు ఈ కార్యక్రమం పై మండిపడుతున్నారు. ముఖ్యంగా అక్కినేని అభిమానులు సైతం నాగార్జునకు తమదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నారు. ఇలాంటి షోలకు హోస్టుగా వ్యవహరించడం కన్నా మీ సినిమాలపై దృష్టి పెడితే మంచి సినిమాలు చేయొచ్చు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలాంటి థ్రిల్ లేదు.ఈ కార్యక్రమంలో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎవరూ కెప్టెన్ అవుతారో, టాస్క్ లో ఎవరు విన్ అవుతారు అనే విషయాలన్నీ కూడా ముందుగానే తెలిసిపోతున్నాయి ఇలా అన్ని ముందుగా లీక్ అవ్వటం వల్ల ఈ కార్యక్రమానికి వచ్చే రేటింగ్ కూడా తగ్గిపోతుందని ఇలాంటి ఒక షోకి హోస్ట్ గా వ్యవహరించడం వల్ల నాగార్జున ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతుందని అందుకే ఈ షో కి దూరంగా ఉండాలనీ కొందరు అభిమానులు నాగార్జునకు చిన్నపాటి హెచ్చరిక చేస్తున్నారు.