కామెడీ షో జడ్జ్ గా స్టార్ డైరక్టర్… మరి షో హిట్టయ్యేనా? ఫట్టయ్యేనా..?

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లేటెస్ట్ సినిమాలతో పాటు రియాలిటీ షోలను కూడా ప్రేక్షకుల ముందుకి తీసుకువస్తుంది. ఇప్పటికే ఆహా వేదికగా బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో తో పాటు సింగింగ్, డాన్సింగ్ షోలు కూడా ప్రసారమవుతున్నాయి. ఇక ఆహా మరొక అడుగు ముందుకు వేసి కామెడీ షో ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ క్రమంలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే సరికొత్త కామెడీ షో ని తొందరలోనే ప్రసారం చేయనుంది. ఇక ఈ కామెడీ షోలో సుడిగాలి సుధీర్ కి రోల్ ప్లే చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ కి దూరమైన తర్వాత సుధీర్ మాటీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్ అనే షోలో యాంకర్ గా వ్యవహరించాడు. కానీ ఆ షో కొంతకాలానికే నిలిపివేశారు. ఇక ఇప్పుడు ఆహా వేదికగా ప్రసారం కానున్న ఈ కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ లో సుడిగాలి సుదీర్ తో పాటు జబర్దస్త్ మాజీ కమెడియన్లందరూ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ కామెడీ షో కి జడ్జ్ గా ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి వ్యవహరించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఇప్పటికే బాలకృష్ణ హోస్ట్ గా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో మంచి హిట్ అయింది. ఇక తన సినిమాలలో మంచి టైమింగ్ ఉన్న కామెడీని పెట్టి ప్రేక్షకుల్ని నవ్విస్తున్న నవ్విస్తున్న అనిల్ రావిపూడి ఇప్పుడు కామెడీ షోకి జడ్జిగా వ్యవహరించనున్నాడు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో… అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చి పవర్ఫుల్ డైలాగ్ చెప్పి షో మీద హైప్ క్రియేట్ చేశాడు. అయితే ఈ కామెడీ షో వల్ల బాలకృష్ణ లాగా అనిల్ రావిపూడి సక్సెస్‌అవుతాడా? లేక గతం కొందరు హీరో హీరోయిన్లు జడ్జిలు గా ఫెయిల్ అయినట్టుగా బ్యాడ్ రివ్యూస్ సొంతం చేసుకుంటాడో చూడాలి మరి.