శ్రీ సత్యతో రొమాన్స్ చేసిన శ్రీహాన్.. మండిపోతున్న అర్జున్!

బిగ్ బాస్ కార్యక్రమం నాలుగు వారాలను పూర్తి చేసుకుని ఐదవ వారంలోకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ఐదవ వారం నామినేషన్స్ కూడా చాలా హాట్ హాట్ గా జరిగాయి.ఇకపోతే నామినేషన్స్ లో ఒకరిపై ఒక రూపాయి అయినటువంటి కంటెస్టెంట్లను కూల్ చేయడానికి బిగ్ బాస్ తన పుట్టినరోజు వేడుకలను ఎంతో గ్రాండ్ గా నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లో తమ టాలెంట్ తో బిగ్ బాస్ లో మెప్పించాలని కోరారు. ఈ క్రమంలోనే ఆర్జే సూర్య మొదట మిమిక్రీతో అందరిని నవ్వించారు.

అదేవిధంగా ఈ టాస్క్ లో భాగంగా శ్రీ సత్యతో కలిసి శ్రీహాన్ ఒక రొమాంటిక్ డాన్స్ చేశారు.సీతారామం సినిమాలోని ఓ సీతా అనే పాటకు శ్రీ సత్యతో కలిసి శ్రీహన్ రొమాంటిక్ డాన్స్ చేయడమే కాకుండా ఏకంగా తనని ఎత్తుకొని గాల్లో తిప్పాడు.అయితే శ్రీ సత్యను నామినేట్ చేయలేక తనని తానే సెల్ఫ్ నామినేట్ చేసుకున్నటువంటి అర్జున్ ఇలా శ్రీ సత్య శ్రీహాన్ తో కలిసి రొమాంటిక్ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడంతో అర్జున్ ఒక్కసారిగా ముఖం మార్చుకున్నారు.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ టాస్క్ లో భాగంగా మరి ఎవరు బిగ్ బాస్ ని మెప్పిస్తారనే విషయం తెలియాలంటే ఈ ఎపిసోడ్ పూర్తి అయ్యేవరకు వేచి చూడాలి.ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇందులో ఒక్కో కాంటెస్ట్ ఒకో విధంగా తమ టాలెంట్ తో బిగ్ బాస్ ను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక నాలుగు వారాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నలుగురు కంటెస్టెంట్లను బయటకు పంపించగా ఇక హౌస్ లో 17 మంది కంటెస్టెంట్లు కొనసాగుతున్నారు.