దీప కార్తిక్ కోసం బయలుదేరిన సౌందర్య…. సౌర్య పరిస్థితి చూసి కుమిలిపోతున్న కార్తీక్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న కార్తిక దీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠ భరితంగా సాగుతోంది.నేటి ఎపిసోడ్ లో భాగంగా సౌందర్య తిరిగి కార్తీక్ దీపాలను వెతకడం కోసం బయలుదేరుతూ ఉండగా ఆనందరావు వచ్చి మనం ఎన్నిసార్లు వెతికిన ప్రయోజనం లేదు. అక్కడికి వెళ్లి వెతకడం నిరాశతో ఇంటికి రావడం తిరిగి బాధపడటం నాకెందుకో వాళ్ళు లేరని అనిపిస్తుంది అంటూ బాధపడతాడు. అప్పుడు సౌందర్య మాట్లాడుతూ చంద్రుడు ఇంద్రమ్మ సౌర్యను మనకు ఇవ్వకుండా ఊర్లు తిప్పుతున్నారు అంటూ కార్తీక్ వాళ్ళు బ్రతికే ఉన్నారని అర్థం ఆ మోనిత వారిద్దరినీ కిడ్నాప్ చేసి అయినా డ్రామాలు ఆడుతుంది. దానిని తక్కువ అంచనా వేయకూడదు నేను పెళ్లి తీరుతానని చెబుతుంది.

ఇక కార్తీక్ జాగింగ్ వెళ్లడానికి సిద్ధమవుతూ ఉండగా అంతలో అక్కడికి ఒక ఆవిడ వచ్చి మీరు ఈరోజు బయటకు వెళ్లడానికి వీల్లేదు ఈరోజు శుక్రవారం మీరు దీప ఇద్దరు కలిసి పూజ చేయాలి ఇప్పటికే దీపమ్మ స్నానం చేసి ఉంటారు మీరు కూడా పదండి అని చెబుతుంది.ఇంతలోగా దీప అక్కడికి వచ్చి ఎవరు మీరు అని ప్రశ్నించగా తనని డాక్టర్ చారుశీల పంపించిందని చెబుతుంది.ఆమె అలా చెప్పేసరికి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు ఇక దీప బొట్టు పెట్టుకుంటూ తయారవుతుండగా అక్కడికి వచ్చిన పండరి అలా కాదు బొట్టు పెట్టుకోవడం అని చెబుతుంది. ఇక దీప ఆమె వివరాలు అడిగి తెలుసుకుందామని ప్రయత్నం చేసినప్పటికీ తను తన వివరాలను దాచేస్తూ పారిపోతూ ఉంటుంది.

మరోవైపు చంద్రమ్మ ఫ్రూట్స్ క్యారెట్లు దోసకాయలు తీసుకువస్తుంది. సౌర్యమ్మ నీకు ఇష్టమని ఫ్రూట్స్ క్యారెట్స్ తీసుకువచ్చానని చెప్పగా కానీ బాబాయ్ కి ఇష్టం లేదు కదా అనడంతో బాబాయ్ కోసం దోసకాయ పచ్చడి చేయడానికి దోసకాయలు తీసుకువచ్చా అని చెబుతుంది. దోసకాయలను విసిరు కొట్టి ఇవి నాకు నచ్చవు పిన్ని అని చెబుతుంది. ఇక సౌర్య పూలు కోయడానికి వెళ్ళగా చంద్రమ్మ జాగ్రత్తలు చెబుతుంటుంది.మరోవైపు చారుశీల కార్తీక్ ఇద్దరు కూడా దీప ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటూ తనని ఎలాగైనా కాపాడుకోవాలని మాట్లాడుతూ ఉంటారు. ఇక పువ్వుల కోసం పైకి ఎక్కిన శౌర్య ఒక్కసారిగా కింద పడిపోతుంది.

ఇలా శౌర్య పడిపోవడంతో ఇంద్రమ్మ చంద్రుడు కంగారుగా అక్కడికి వెళ్తారు. అప్పటికే సౌర్య స్పృహలో ఉండదు.దీంతో చంద్రుడు వెంటనే కార్తీక్ ఫోన్ చేసి జరిగినది మొత్తం చెప్పగా కార్తీక్ ఆందోళన చెందుతూ ఒక అడ్రస్ చెప్పి అక్కడికి తీసుకు రమ్మంటాడు.ఈ దేవుడు దీపతో మాత్రమే కాకుండా నా కూతురికి కూడా ఇలాంటి శిక్షలు వేస్తూ నన్ను మరింత ఇబ్బందులు పెడుతున్నాడని కార్తీక్ ఎమోషనల్ కాగా చారుశీల తనని ఓదారుస్తుంది.ఇక సౌందర్య ఆనందరావు బయలుదేరుతూ ఉండగా ఫ్లైట్లో వెళ్దామని చెప్పగా లేదు కారులోనే వెళ్తానని చెబుతుంది ఆయన అంత దూరం డ్రైవింగ్ చేస్తూ ఎలా వెళ్తావు అని ఆనందరావు అడగడంతో ఒకప్పుడు డ్రైవర్ గా పనిచేస్తున్న అంజిని పిలిచాను అని చెబుతుంది.

ఇక చంద్రుడు ఇంద్రమ్మ సౌర్యను హాస్పిటల్ కి తీసుకురావడంతో శౌర్య స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. దీంతో చారుశీల తనని ట్రీట్మెంట్ చేస్తానని చెబుతుంది. ఇక కార్తీక్ ఏం జరిగిందని తెలుసుకోగా జరిగినది మొత్తం చంద్రమ్మ చెప్పడంతో కార్తీక్ చంద్రమ్మ పై సీరియస్ అవుతాడు.ఇక చారుశీల కార్తీక్ అని పిలవడంతో స్పృహలోకి వచ్చిన సౌర్య ఇందాక కార్తీక్ అనిపిలిచారు ఎవరు? అది మా డాడీ పేరు మా డాడీ ఇక్కడికి వచ్చారా అంటూ ఉండగా కార్తీక్ చాటుగా తన కూతురు మాటలు విని కుమిలిపోతూ ఉంటాడు.