గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు.. కొత్త చాప్టర్ అంటూ సోహెల్ పోస్ట్

Sohel about his new movie Announcement

బిగ్ బాస్ షోలో ఉన్నంత వరకే వారికి కాస్త పాపులార్టీ ఉంటుంది. వారు లోపల ఆడుతున్నంత సేపు వారి ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో వార్ జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి బిగ్ బాస్ షో ముగిశాక కంటెస్టెంట్లు, విన్నర్, రన్నర్ అనే వాళ్లు కనబడకుండా పోతారు. మహా అంటే ఒక నెల మాత్రమే వార్తల్లో ఉంటారు. తరువాత షరా మామూలే. ఇంత వరకు బిగ్ బాస్ కంటెస్టెంట్లు, అది విజేతగా నిలిచిన వారైనా సరే.. కెరీర్‌లో పీక్స్‌కు చేరలేదు. బిగ్ బాస్‌ను వాడుకుని తెరపై స్టార్డం తెచ్చుకున్న వారెవ్వరూ లేరు.

కానీ ఈ నాల్గో సీజన్‌లో మాత్రం సోహెల్, అభిజిత్ వంటి వారు ఎదిగేలానే కనిపిస్తున్నారు. వారికి ఉన్న ధృడ నిశ్చయం, తెరపై హీరోగా రాణించాలనే పట్టుదల, ఈ ఊపు చూస్తుంటే వీరి జీవితాల్లో ఏదో మిరాకిల్ జరిగేలానే కనిపిస్తోంది. వీరే కాకుండా మోనాల్, అఖిల్, అవినాష్ వంటి వారి లైఫ్‌లోనూ ఇప్పటికే మంచి ఆఫర్లు వచ్చినట్టు కనిపిస్తోంది. మోనాల్ అయితే ఏకంగా షూటింగ్‌లతో బిజీగా ఉంటోంది. ఇదే క్రమంలో సోహెల్ తన కొత్త ఆరంభం గురించి పోస్ట్ చేశాడు.

Sohel about his new movie Announcement
Sohel about his new movie Announcement

ఫ్రెండ్స్.. ఇంకా కొంచెం సెపట్ల.. కథలో ఇంకో మెయిన్ చాప్టర్ స్టార్ట్ అయితది అనే పోస్ట్ పెట్టాడు. మీకు ప్రామీస్ చేసిన ప్రకారం.. మీరు చూపించిన ప్రేమను తిరిగి ఇచ్చేందుకు ఫస్ట్ స్టెప్ వేస్తున్నా..మరి కొన్ని గంటల్లో అసలు విషయం చెబుతానంటూ పోస్ట్ చేశాడు. ఇక సమయం వృథా చేయను అంటూ చెప్పుకొచ్చాడు. అంటే సోహెల్ తన కొత్త సినిమా ప్రకటనను చేయబోతోన్నాడని తెలుస్తోంది. మరి చూడాలి అందులో ఎలాంటి విశేషాలున్నాయో.