బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి ఆదరణ ఉందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఆరవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ సీజన్ మరికొన్ని గంటలలో ముగియనుంది. ఇకపోతే ఎలిమినేషన్ లో భాగంగా బిగ్ బాస్ నుంచి శ్రీ సత్య ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా టాప్ ఫైవ్ లో ఉంటుందని భావించిన శ్రీ సత్య మిడ్ వీక్ ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కి గురిచేస్తుంది.
ఇకపోతే ఎలిమినేషన్ లో భాగంగా బయటకు వచ్చినటువంటి శ్రీ సత్య నాగార్జున గురించి అలాగే బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నన్ను ఇన్ని రోజులపాటు బిగ్ బాస్ హౌస్ కొనసాగేలా చేసినందుకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలా బిగ్ బాస్ లో నన్ను సపోర్ట్ చేసిన మీరందరూ కూడా బయట కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అంటూ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తనకు మంచి అవకాశాలే వస్తాయని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే బిగ్ బాస్ లో ఈమె ఎలిమినేట్ అయిన అనంతరం నాగార్జున గురించి ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అందరిలాగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల మాదిరి వేదిక పైకి పిలిచి నాగార్జున నన్ను మాట్లాడనివ్వకపోవడం తనకు చాలా బాధ కలిగించిందని ఈ సందర్భంగ నాగార్జున గురించి శ్రీ సత్య చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.