శ్రీముఖి లక్సరీ లైఫ్ కి నెలకి ఎంత ఖర్చు చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియనివారంటు ఉండరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి గత కొన్ని సంవత్సరాలుగా యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపు పొందింది. ఎలా యాంకర్ గా ఫేమస్ అవ్వటంతో ఈ అమ్మడు సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకుంది. మొదటగా అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత క్రేజీ అంకుల్స్, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించినది. ప్రస్తుతం శ్రీముఖి చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది.

ఇలా ఒకవైపు యాంకరింగ్ చేస్తూ మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నప్పటికీ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో నెల తిరిగేసరికి ఎమ్మడు భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తోంది. టీవీ షోస్ లో యాంకరింగ్ చేసినందుకు ఒక ఎపిసోడ్ కి గాను శ్రీముఖి దాదాపు 3 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటుంది. ఇలా ప్రస్తుతం శ్రీముఖి దాదాపు మూడు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరిస్తోంది. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా భారీగానే డబ్బు సంపాదిస్తోంది.

అయితే శ్రీముఖి తన సంపాదనకి తగ్గట్టుగానే ఖర్చులు కూడా చేస్తోంది. సాధారణంగా ఇండస్ట్రీ లో కొంచం పాపులర్ అయితే చాలు లగ్జరీ లైఫ్ మైంటైన్ చేస్తూ ఉంటారు. ఇక బుల్లితెర యాంకర్ గా నటిగా మంచి గుర్తింపు పొందిన శ్రీముఖి కూడా తన స్థాయికి తగ్గట్టుగానే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తోంది. ఇందుకోసం ఆమె నెల దాదాపు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. శ్రీముఖి అని మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలమంది ఇలా లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయటం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.