తులసికి భర్తగా సామ్రాట్…. విషమ పరిస్థితులలో తులసి!

బుల్లితెర పై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే బెనర్జీ చేపడుతున్న కొత్త ప్రాజెక్టు లాస్య తీసుకున్నారని తెలియడంతో తులసి షాక్ అయ్యి తన గురించి అసలు విషయం చెప్పేస్తుంది.ఇదివరకే బెనర్జీ గురించి నేను అంత ఎంక్వయిరీ చేశాను అతను మోసగాడు సామ్రాట్ ఈ ప్రాజెక్టు కాదంటేనే ఆయన మీ వద్దకు వచ్చారని చెబుతుంది. దీంతో నందు సలహా ఇచ్చినందుకు థాంక్స్ కాని అడగకుండానే ఇలా సలహాలు ఇవ్వద్దు అని చెబుతాడు.ఇక నందు మాట్లాడుతూ నాకు ఇష్టం లేకపోయినా నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు తీయని విషానివి నవ్వుతూనే కాటేస్తావు అంటూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు.

నందగోపాల్ ఇలా మాట్లాడటంతో చేసేదేమీ లేక తులసి అక్కడి నుంచి చాలా చిరాకుగా ఇంటికి వెళుతుంది ఇంటికి వెళ్లిన తులసి కాస్త నీళ్లు తాగి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది. మరోవైపు అభి ప్రేమ్ అంకిత శృతి నలుగురు క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. అదే సమయంలోనే అభికి ఏదో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతాడు ఆ టైంలో అంకిత ఆడేటప్పుడు కూడా ఫోన్ ఏంటి ఫోన్ కాసేపు పక్కన పెట్టు అంటూ సైలెంట్ మోడ్ లో పెట్టేస్తారు. మెలుకువలోకి వచ్చిన తులసి అభి ప్రేమ్ కి ఫోన్ చేయగా ఎవరు లిఫ్ట్ చేయరు. దీంతో సామ్రాట్ కి ఫోన్ చేస్తుంది.

సామ్రాట్ ఫోన్ లిఫ్ట్ చేసి తులసి గారు అని మాట్లాడుతున్న మాట్లాడరు. తిరిగి సామ్రాట్ ఫోన్ చేయడంతో ఫోన్ లిఫ్ట్ చేయరు.కంగారు పడిన సామ్రాట్ తులసి ఇంటికి వస్తాడు. అయితే డోర్ లాక్ చేసి ఉండడంతో తులసిగారని తలుపులు కొడతాడు ఫోన్ చేసినప్పటికీ ఫోన్ రింగ్ అయ్యే సౌండ్ వినపడుతుంది. తులసి గారు ఇక్కడే ఉన్నారు కానీ ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని కిటికీలోకి వెళ్లి చూడగా తులసి కిందకు పడిపోయి ఉంటుంది. దీంతో సామ్రాట్ కంగారుగా తులసి గారు అంటూ తలుపులు బద్దలు కొట్టి ఆమెను హాస్పిటల్ కి తీసుకువెళ్తారు.

హాస్పిటల్లో చేర్పించిన అనంతరం డాక్టర్లు ఆమె కండిషన్ చూసి తన చాలా విషమంగా ఉందని బిపి అబ్నార్మల్ గా ఉందని పల్స్ కూడా పడిపోయిందని చెబుతారు.తనకు మేజర్ ట్రీట్మెంట్ అవసరమని చెప్పడంతో వెంటనే సామ్రాట్ మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి నేను బిల్ పే చేస్తాను అని చెప్పడంతో నర్స్ వచ్చే ఫార్మాలిటీస్ ఫీల్ చేయమని చెబుతారు.అందులో తాను హస్బెండ్ గా సంతకం చేస్తాడు. ఇప్పుడు నేను చెయ్యకపోతే వారి ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేవరకు తులసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయరు అప్పటివరకు ఉంటే తన పరిస్థితి విషమంగా మారుతుందని తప్పనిసరి పరిస్థితులలో తులసికి భర్తగా సామ్రాట్ సంతకం చేస్తాడు.

ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుండగా తులసి తమ్ముడికి సామ్రాట్ ఫోన్ చేసి అసలు విషయం చెప్పడంతో ఇప్పుడే తను తన తల్లిని వెంటబెట్టుకొని వస్తున్నానని చెబుతాడు. మరోవైపు పిల్లలందరూ సంతోషంగా క్యారమ్స్ ఆడుతూ ఉండడంతో లాస్య నందు అక్కడికి వస్తారు.ఇక అక్కడికి వచ్చిన తర్వాత లాస్య అలా ఉన్నావేంటి నందు చెప్పేసేయ్ అని అంటుంది ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.