సమంత కొన్ని నిజాలు బయటకు చెప్పేసింది. అది తెలిసి చెప్పిందో తెలియక చెప్పిందో.. ఉండబట్టలేక సంతోషంలో చెప్పిందో గానీ మొత్తానికి బయట పడింది. తాను ఇంత వరకు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని, అయినా హెస్టింగ్ చేసేశానని చెప్పేసింది. అయితే ఇదంత తన మామగారు నాగార్జున అందించిన సహాకారంతో అని సమంత ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అసలు ఆ పోస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చిందో.
మామూలుగా సమంత హోస్టింగ్‌కు మంచి రివ్యూలు వచ్చాయి. మామను మించిన కోడలు.. అసలు నాగార్జున ఎందుకు మొత్తం సమంతతోనే నడిపించొచ్చు కదా? తరువాతి సీజన్‌కు హోస్ట్ దొరికేసిందోచ్ అంటూ సమంతపై ప్రశంసలు కురిపించారు. మామూలుగా అయితే గత సీజన్‌లో రమ్యకృష్ణ ఓ వీకెండ్‌ను హోస్ట్ చేసిన సమయంలోనూ ఇలాంటి కామెంట్లే వచ్చాయి. ఒక్కరోజు మురిపం కాబట్టి అలానే ఉంటుందని కొందరుఅంటున్నారు.
అయితే బిగ్ బాస్ హోస్టింగ్‌పై ప్రశంసలు వస్తున్న నేపథ్యంలో సమంత స్పందించింది. ఆ అనుభవం ఎప్పటికీ గుర్తుండి పోతుంది. బిగ్ బాస్ స్టేజ్ మీద హోస్ట్‌గా నిలబడతానని ఎప్పుడూ ఊహించలేదు అనుకోలేదు.. అదంతా కేవలం మామగారి వల్లే సాధ్యమైంది.. నా భయాలను అధిగమించే ధైర్యాన్ని తెచ్చుకున్నాను.. హోస్ట్‌గా చేసిన అనుభవం కూడా లేదు.. తెలుగు రాదనే భయం.. పైగా ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు.. షోకి వచ్చే మూడు రోజుల ముందే మారథాన్‌లా పరిగెత్తాల్సి వచ్చింది.. అవన్నీ దాటేందుకు సాయపడిన మామగారికి థాంక్స్.. నా మీద నమ్మకం ఉంచినందుకు థాంక్స్. ప్రేక్షకులు కురిపించిన ప్రేమకు థాంక్స్.. అంటూ ఎమోషనల్ అయింది.