రీతు చౌదరి ఇంట విషాదం… నాకోసం తిరిగి రా నాన్న అంటూ ఎమోషనల్!

జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి రీతు చౌదరి ఒకరు.ఈమె పలు బుల్లి తెర కార్యక్రమాలలో సందడి చేస్తే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున సందడి చేసే ఈమె ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రీతు చౌదరి తండ్రి ఉన్నఫలంగా గుండెపోటుతో మరణించడంతో ఈమె తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

తన తండ్రితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా మీతో కలిసి ఇలాంటి ఫోటో షేర్ చేయాల్సి వస్తుందని తాను ఎప్పుడూ అనుకోలేదు. మీతో కలిసి దిగిన నా చివరి ఫోటో ఇది. మీరు లేకుండా నేను ఎప్పుడూ ఉండలేను.మరి నన్ను వదిలి ఎలా వెళ్ళిపోయావు నాన్న ఈ కూతురి కోసం ఒక్కసారి తిరిగి రా నాన్న ప్లీజ్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతోమంది సెలబ్రిటీలు తన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు.

చిన్నప్పటి నుంచి తన తండ్రితో ఎంతో మంచి అనుబంధాన్ని ఏర్పరచుకున్నటువంటి ఈమె ఒక్కసారిగా తన తండ్రి లేని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో కూడా తరచూ తన తల్లిదండ్రులతో కలిసి పలు వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకునేవారు. ఇలా తండ్రితో ఒక స్నేహితురాలుగా ఉన్నటువంటి రీతు చౌదరి తన తండ్రి మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.