తల్లికి రక్తదానం చేసిన రిషి.. జగతిని చూస్తూ ఎమోషనల్ అయిన రిషి!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో ప్రేక్షకాదరణ పొందిన గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకుంటుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథ నేపథ్యంలో ఈ సీరియల్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా జగతి మహేంద్ర వస్తారని రిషి వసుధార ఇంటి వద్ద వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రిషి తన డాడ్ తో కలిసి కాఫీ తాగి టిఫిన్ చేయాలని తన తండ్రి కోసం ఎదురు చూస్తూ కాఫీ కూడా తాగరు. అదే సమయంలో దేవయాని అక్కడికి వచ్చి వచ్చేవాళ్లు రాకుండా మానరు వారికోసం నువ్వు తిండి తిప్పలు మానేసి ఇలా ఎదురు చూడటం ఏంటి రిషి అంటూ చెప్పగా డాడ్ తప్పకుండా వస్తారు పెద్దమ్మ తను వచ్చిన తర్వాతే నేను తాగుతాను అంటూ చెప్పి పంపిస్తారు.

మరోవైపు హాస్పిటల్ లో గౌతమ్ డాక్టర్ వద్దకు వెళ్లి వారికి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని ఎంక్వయిరీ చేయగా జగతికి రక్తం ఎక్కువగా పోయింది వెంటనే తనకు బ్లడ్ అరేంజ్ చేయమని చెబుతారు. దీంతో సరేనని గౌతమ్ వస్తారు.మరోవైపు పెదనాన్న నీతో మాట్లాడాలని అంటున్నారు కిందికి వెళ్దాం పద రిషి అంటూ దేవయాని చెప్పగా రిషి డాడ్ వాళ్లు వస్తారు కదా వసుధార అంటూ కంగారు పడగా తప్పకుండా వస్తారు సార్ అంటూ వసుధారధైర్యం చెబుతుంది. ఇంతలో గౌతమ్ ఫోన్ చేసి వెంటనే మీరు హాస్పిటల్ కి రావాలి అంటూ ఫోన్ చేస్తాడు.

ఇక్కడ మీ అవసరం చాలా పడింది ఇది ఒక్కసారి నా మాట విని నాకు సహాయం చేయి ప్లీజ్ అంటూ గౌతం అడగగా… రేయ్ గౌతమ్ ఇప్పుడు నేను ఎలా రాగలరు ఒకవైపు డాడ్ వాళ్లు వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కదా అంటూ రిషి చెప్పగా ఇదొక్కసారికి నా మాట విని హాస్పిటల్ కి రారా అంటూ గౌతం ఫోన్ కట్ చేస్తారు.ఆ మాటకు వసుధర సార్ ఎంతో అవసరం ఉంటే తప్ప మనల్ని పిలవరు ఇన్నిసార్లు ఫోన్ చేయరు వెంటనే హాస్పిటల్ కి వెళ్దాం పదండి సార్ అంటూ వసుధార హాస్పిటల్ కి వెళ్తారు.

హాస్పిటల్ వెళ్లగానే అసలు ఏమైందిరా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రమ్మన్నావు అవతల డాడ్ వాళ్లు వస్తున్నారు కదా అంటూ రిషి మాట్లాడతారు.ఇంతకీ హాస్పిటల్లో ఎవరున్నారు ఎవరికి యాక్సిడెంట్ అయింది అంటూ రిషి ప్రశ్నల మీద ప్రశ్నలు అడగగా గౌతం మహేంద్ర ఐసీయూలో ఉండడం చూపిస్తారు.అది చూసిన వసుధార రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లి డాడ్ అసలు మీకు ఏమైంది లేవండి అంటూ కంగారుపడగా మహేంద్ర మెలుకువ వచ్చి జరిగినది మొత్తం వివరిస్తాడు. అదే సమయంలో వసుధార జగతి మేడం అంటూ అడగగా పక్కనే ఉన్న జగతిని చూపిస్తారు.

ఇలా జగతిని చూసిన వసుధార ఎంతో కంగారు పడి మేడం లేవండి ప్లీజ్.. ఏమైంది మీకసలు లేవండి అంటూ ఏడుస్తూ ఉంటుంది.అంతలో డాక్టర్ అక్కడికి వచ్చి మీకు బ్లడ్ అరేంజ్ చేయమని చెప్పాను కదా ఇట్స్ ఎమర్జెన్సీ ఈమెది రేర్ బ్లడ్ గ్రూప్ వెంటనే బ్లడ్ కావాలి అంటూ చెప్పడంతో వెంటనే రిషి నాది కూడా అదే బ్లడ్ గ్రూప్ నేను తనకు బ్లడ్ ఇస్తానని చెప్పడంతో వసుధార గౌతం మహేంద్ర షాక్ అవుతారు. రిషి తన తల్లికి బ్లడ్ ఇస్తూనే జగతినీ చూస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు . అది చూసిన మహేంద్ర గౌతమ్ వసుధార సంతోషపడగా ఎందుకిలా జరిగింది గౌతం అంటూ మహేంద్ర బాధపడతాడు. ఇక జగతికి అలా జరగడం చూసి వసుధార ఏడుస్తూ ఉండగా రిషి తనకు ఏం కాదంటూ ఓదారుస్తాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.