నీ దూరం భరించలేనని బాధపడిన రిషి….. దేవయానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన జగతి!

గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే వసుధార రిషి ఇద్దరు కూడా తను చదివిన కాలేజ్ ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలోపే రిషి జగతి మేడం వసుధారకు ఇవ్వమని చెప్పినటువంటి గిఫ్ట్ తన చేతిలో పెడతారు. జగతి మేడం ఏం పంపించింది అని చూసేలోపు మహేంద్ర రిషికి ఫోన్ చేస్తారు.జాగ్రత్త అంటూ మహేంద్ర చెప్పడంతో డాడీ పెద్దమ్మని టెన్షన్ పడొద్దు అని చెప్పు అంటూ రిషి మాట్లాడతారు. నేను ఫోన్ చేయగానే మీరందరూ ఇక్కడికి రావడానికి సిద్ధం కండి అని రిషి మహేంద్రతో చెబుతాడు.

ఫోన్ మాట్లాడిన అనంతరం రిషి వసుధార ఇద్దరు కూడా తిరిగే కార్లో బయలుదేరుతారు. అయితే తన ఇల్లు దగ్గరికి రాగానే వసుధార ఇక్కడే ఆపండి సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మీరు అక్కడికి రావద్దు చాలా రోజుల తర్వాత మా నాన్న నన్ను చూస్తున్నారు. అతను ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్న నేను భరించలేను అని చెబుతుంది. పరిస్థితులని చక్కబడిన తర్వాత నేను మీకు కాల్ చేస్తాను అని వసుధార చెప్పడంతో రిషి కూడా అందుకు సరే అంటాడు.

నీ దూరం నేను భరించలేకపోతున్నాను వసుధార ఇక్కడే ప్రాణం పోతున్నట్టు ఉంది. నీ ఫోన్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి వసుధారణను తన ఇంటికి పంపుతారు.మరోవైపు జగతి పుస్తకం చదువుతూ ఉండగా దేవయాని అక్కడికి వచ్చి పుస్తకం చదువుతూ ఉంటే డిస్టర్బ్ చేసానా జగతి అని మాట్లాడుతుంది. పర్లేదు చెప్పండి అక్కయ్య అంటూ జగతి మాట్లాడగా నీతో కొంచెం మాట్లాడాలి కూర్చో జగతి అని ఇద్దరు కూర్చుని మాట్లాడుతుంటారు.

నా మనసు ఏం బాగాలేదు రిషి వసుధారతో కలిసి వెళుతున్నట్టు మీరు కూడా చెప్పలేదు. రిషి కూడా నాకు చెప్పలేదు. రిషిని తిరిగి వచ్చేయమని చెబితే రానని చెప్పాడు అని దేవయాని చెప్పగా జగతి షాక్ అవుతుంది. అలా ఎందుకు చెప్పారు అక్కయ్య రిషి ఇష్టాన్ని మీరు ఎందుకు గౌరవించడం లేదు అంటూ జగతి మాట్లాడగా…నా మాటను కాదనని రిషి ఇప్పుడు నాకే ఎదురు చెబుతున్నారు. రిషిని వసుధార ద్వారా నీ మాయలో పడేసుకున్నారు.వసుధారను అడ్డుపెట్టుకొని రిషితో అమ్మ అని పిలిపించుకోవాలని కోరిక ఇంకా చచ్చిపోలేదు అంటూ జగతిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది.

నీకు రిషి పై ప్రేమ లేదు అంటూ దేవయాని మాట్లాడటంతో వెంటనే జగతి ఇంకొకసారి రిషికి నా మీద ప్రేమ లేదని మాత్రం మాట్లాడకండి అలా అంటే నేను సహించను.మీరు రిషి పై ప్రేమ చూపిస్తున్నారా రిషిని అడ్డుపెట్టుకొని ఇంట్లో పెత్తనం చలాయించాలని చూస్తున్నారు. ఇన్ని రోజులు నన్ను మహేంద్రను విడదీశారు. ఇప్పుడు రిషి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. నేను ఎన్నైనా భరిస్తాను కానీ రిషి జీవితం జోలికి వస్తే అసలు క్షమించను నేను వెంటనే మీ గురించి మొత్తం రిషికి చెప్పేస్తాను అంటూ జగతి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో దేవయాని ఏం మాట్లాడాలో తెలీక నీ సంగతి ఆ వసుదార సంగతి త్వరలోనే తేలుస్తా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.మరోవైపు వసుధార ఇంటికి వెళ్ళగా తన తల్లి పూజ చేస్తూ ఉంటుంది. అయితే వసుధార వెళ్లడంతో ఆమె ఎంతో సంతోషపడగా తన తండ్రి ఆశీర్వాదం కోసం వెళ్లి వసుధారా నేను యూనివర్సిటీ టాపర్ గా వచ్చానని చెప్పడంతో ఇక్కడ ఎందుకు వచ్చావు అంటూ తన తండ్రి సీరియస్ అవ్వడంతో వసుధార షాక్ అవుతుంది.