వసుధర నాకు కాబోయే భార్య అంటూ అందరి ముందు చెప్పిన రిషి…. షాక్ లో దేవయాని…. సంతోషంలో జగతి!

బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే…వసుధారణ ఇంటికి రమ్మని రిషి పిలవడంతో ఏ హక్కుతో రావాలి నాకు ఏం అర్హత ఉందని ఆ ఇంట్లోకి రావడానికి అని వసు మాట్లాడుతుంది.నాకు ఏదైనా కష్టం వస్తే ఈ అమ్మవారి దగ్గరికి వస్తాను అందరూ తరిమేస్తే మా అమ్మ దగ్గరకు వెళ్తాను నేను మా ఊరికి వెళ్తాను అని చెప్పడంతో రిషి షాక్ అవుతాడు.

ఇలా వసుధార ఊరికి వెళ్ళిపోతానని చెప్పడంతో రిషి తన చెయ్యి పట్టుకొని నువ్వు నాతో రా వసుధార? నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం నేను చెబుతానని తనని ఇంటికి తీసుకు వెళ్తాడు. మరోవైపు మహేంద్ర జగతికి సేవలు చేస్తూ దేవయాని గురించి మాట్లాడుకుంటారు. దేవయాని అక్కయ్య తన ప్లాన్స్ కారణంగా రిషి వసుధారణను విడగొడుతుందేమోనని కంగారు పడతారు. ఇలా జగతి మహేంద్రా ఇద్దరు కూడా రిషి వసుధార గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే రిషి ఇంట్లోకి అడుగుపెట్టి ఇంటి గుమ్మం వద్ద నిలబడి ఇంట్లో ఉన్న అందరిని పిలుస్తారు.ఇప్పుడు ఎందుకు సార్ అందరినీ పిలుస్తున్నారు అని వసుధార అనడంతో నువ్వు కాసేపు మౌనంగా ఉండు నువ్వు ఇందాక నన్ను ప్రశ్నలు అడగవు ఇప్పుడు నేను సమాధానం చెబుతానని రిషి మాట్లాడుతాడు.

ఈ విధంగా రిషి అందరిని పిలవడంతో అందరూ అక్కడికి వస్తారు దేవయాని మాత్రం వసదారని చూసే షాక్ అవుతుంది జగతి వారిద్దరిని చూసి సంతోషపడుతుంది. ఈ సందర్భంగా రిషి వసుధార చెయ్యి పట్టుకోవడంతో దేవయాని షాక్ అవుతుంది. రిషి మాట్లాడుతూ… నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పడంతో అందరూ సంతోషపడగా దేవయాని మాత్రం షాక్ అవుతుంది.వసుధారణ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మీకు ఎవరికైనా అభ్యంతరమా అంటూ అందరిని అడుగుతారు పెద్దమ్మ మీకు ఇష్టమేనా అని చెప్పడంతో అది కాదు నాన్న అని దేవయాని ఏదో చెప్పబోతుండగా ఇష్టమా కాదా అని అడగడంతో ఇష్టమేనని చెబుతుంది.

రిషి ఇంట్లో అందరి నిర్ణయాలను తెలుసుకుంటాడు.అందరూ సంతోష పడుతూ ఉండగా దేవయాని మాత్రం అసలు రిషికి ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనసులో అనుకుంటుంది.వసుధార ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం దొరికింది అనుకుంటున్నాను ఈ అర్హతతో నేను ఇక్కడికి రావాలని అడిగావు కదా నువ్వు ఈ రిషేంద్ర భూషణ్ కి కాబోయే భార్యవు. జీవితాంతం నాకు తోడుగా ఉండి నాతో పాటు నడిచే నా భార్యవి అని సమాధానం చెప్పడంతో దేవయాని మాత్రం షాక్ అవుతూ ఉంటుంది. వసుధారణ తీసుకువెళ్లి పెద్దమ్మ మా పెళ్లి జరిపించండి అని చెబుతాడు.

తప్పకుండా జరిపిస్తాను నీ పెళ్లి నేను కాక మరెవరు జరిపిస్తారని జగతిని ఉద్దేశిస్తూ చెబుతుంది. ఇలా రిషి వసుధారను తనకు కాబోయే భార్య అని చెప్పడంతో అందరూ సంతోషిస్తారు ఇక ధరణి వసుధారణ లోపలికి తీసుకెళ్తుంది. వసుధారం మేడం అంటూ మాట్లాడుతూ ఉండగా… ఇంకా మేడం అని పిలవడం ఏంటి వసుధార నువ్వు ఈ ఇంటి కోడలివి చక్కగా అక్క అని పిలువు అంటూ ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.