దేవయాని మాటను కాదన్న రిషి…. వసుధారకు ముద్దు పెట్టిన ఈగో మాస్టర్!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…రిషి వసుధార ఇద్దరు కలిసి తన ఊరికి వెళ్తున్నారని తెలుసుకున్నటువంటి దేవయాని వెంటనే రిషికి ఫోన్ చేసి తిరిగి వచ్చేయమని చెబుతుంది. రిషి వసుదారని ఒంటరిగా పంపించలేను పెద్దమ్మ అంటూ ఫోన్ కట్ చేస్తారు. ఇలా తన మాట కాదన్నందుకు దేవయాని ఎంతో ఆగ్రహం వ్యక్తం చేసుకుని జగతి దగ్గరకు వెళ్లి పెద్ద ఎత్తున గొడవపడుతుంది.

రిషి వెళ్లేటప్పుడు కనీసం ఒక్కసారి నాకు చెప్పాలి కదా అని దేవయాని మాట్లాడటంతో రిషి మా పర్మిషన్ తీసుకొని వెళ్లలేదు అంటూ సమాధానం చెబుతుంది.ఇక్కడ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్న నేను తీసుకోవాలనే విషయం మర్చిపోవద్దు అంటూ మహేంద్ర జగతికి వార్నింగ్ ఇస్తుంది.ఇక రిషి వసుధార ఇంటికి వెళ్తే తన నాన్న రిషిని ఎలా అవమానిస్తాడని కంగారుగా ఉంది వెంటనే మనం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం పదండి అంటూ అందరిని కంగారు పెడుతుంది.

దేవయాని ఇలా మాట్లాడటంతో జగతి అక్కయ్య రిషి అక్కడికి వెళ్లి ఫోన్ చేసిన తరువాత మనం అందరూ వెళ్లాలని చెప్పాడు కదా అనవసరంగా వెళ్లడం ఎందుకు అని తనని ఆపే ప్రయత్నం చేస్తుంది. ఇక ఫణీంద్ర సైతం వసుధార తండ్రి రిషినీ ఏమీ అనడు ఏమి అనకుండా వసుధార ఉంది కదా అంటూ ధైర్యం చెబుతాడు. రిషి వద్దని చెప్పిన తర్వాత కూడా మనం వెళ్తే బాగుండదు తను ఫోన్ చేసిన తర్వాతే వెళ్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఇంట్లో తన మాట ఎవరు వినడం లేదని దేవయాని కోపం తెచ్చుకోగా జగతి మహేంద్రా మాత్రం నవ్వుకుంటారు. మరోవైపు వసుధార రిషి ఇద్దరు కారులో ప్రయాణిస్తూ ఉండగా ఏంటి వసుధర ఏమి మాట్లాడటం లేదు అని రిషి అడగడంతో చాలా సంవత్సరాల తర్వాత ఇంటికి వెళ్తున్నాను అన్న ఆనందంలో మాటలు రావడం లేదని వసుధార సమాధానం చెబుతుంది.ఇంతలోనే రిషి కారు పక్కన ఆపి నేను మీ ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఏమని పరిచయం చేస్తావు అని అడుగుతాడు.

ఈయన రిషి సార్ మా ఎండి గారు అని పరిచయం చేస్తాను అని వసుధార చెప్పడంతో అంతేనా ఇంకేం పరిచయం చేయవా అని అడుగుతాడు. ఇంకా మీ గురించి చాలా చెప్పాలి అయితే అవన్నీ కూడా అక్కడే చెబుతానని ముందు కారు పోనివ్వమని వసుధార చెపుతుంది.నువ్వు చెబితేనే కారు కదులుతుంది అని వసుధారా అనగా మీరు నా పక్కన మీరు ఉండగా కారు ఏంటి కారడవి ఉన్నా కానీ భరిస్తాను అనడంతో పొగరు అంటూ రీషి మాట్లాడతారు. అవును మీలాంటి ఎండి సార్ నా పక్కన ఉండగా నాకు పొగరు అంటూ మాట్లాడుతుంది.

ఇక అక్కడికి వెళ్లాక నేను మిమ్మల్ని ఏమని పరిచయం చేయాలో తెలుసుకోవాలంటే ముందు నాకు మీరు ఈ ఉంగరం పెట్టాలని వి ఆర్ అనే అక్షరం ఉన్నటువంటి ఉంగరం రిషికి ఇస్తుంది. రిషి ఆ ఉంగరం వసుధార చేతికి తొడిగి తన చేతికి ముద్దు పెడతాడు. ఇలా వసుధార రిషి ఇద్దరు కాస్త రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోతారు. ఇప్పుడు చెప్పు వసుధర నన్ను ఏమని పరిచయం చేస్తావు అంటే రిషి చేతినీ తీసుకొని రిషిని కళ్ళు మూసుకోమని తన చేతిలో రిషి సార్ మై డార్లింగ్ .. ప్రేమతో మీ పొగరు అని రాయడం చూసిన రిషి ఎంతో సంతోషపడతాడు.ఇప్పుడు చెబుతున్నాను వసుధార ఈ రిషేంద్ర భూషణ్ కు ఎప్పటికీ నీపై ఈ ప్రేమ చెక్కుచెదరదు అంటూ తనకు మాట ఇస్తాడు.దీంతో వసుధార ఇక ఇప్పుడైనా పదండి సార్ చాలా లేట్ అవుతుందని చెప్పడంతో వీరిద్దరూ బయలుదేరుతారు. మరోవైపు జగతి పుస్తకం చదువుకుంటూ ఉండగా అక్కడికి దేవయాని వస్తుంది.