ప్రేమించిన వాడు మోసం చేయటంతో గుండెలు పగిలేలా ఏడ్చిన రష్మి…?

ప్రముఖ బుల్లితెర యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట సినిమా ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రష్మి ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా అవకాశం దక్కించుకుంది. జబర్దస్త్ లో రష్మీ తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగింది. ఇలా ఎన్నో ఏళ్లుగా ఎక్స్ట్రా జబర్దస్త్ కి యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మి ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి మూడు షోలకి యాంకరింగ్ చేసే అవకాశం దక్కించుకుంది. ఇదిలా ఉండగా రష్మి తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా స్పందించదు.

గతంలో ఒకసారి తన లవ్ ఫెయిల్యూర్ అయినట్టు చెప్పింది. అంతె కానీ దాని గురించి పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమాలలో సందడి చేసే రష్మి ఎప్పుడు అదిరిపోయే స్టెప్పులతో డాన్స్ వేస్తూ అందరి చేత విజిల్స్ వేయించేది. కానీ ఇటీవల రష్మీ తన పర్ఫార్మెన్స్ తో అందరి చేత కన్నీళ్లు పెట్టించింది. ఒక అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి మోసం చేస్తే ఆ అమ్మాయి వేదన ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించింది. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి పెళ్లి చేసుకుంటానని నమ్మించి వేరొక డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో రష్మి తన పర్ఫార్మెన్స్ తో అందరి చేత కంటతడి పెట్టించింది.

వినాయక చవితి సందర్భంగా మా ఊరి దేవుడు అనే కార్యక్రమాన్ని ఈటీవీ వారు ఈ కార్యక్రమంలో రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో రష్మీ అటు నువ్వే ఇటు నువ్వే.. `అంటూ సాగే పాటలో చేసిన డాన్సు పర్‌ఫెర్మెన్స్ అందరిని వేరే లోకానికి తీసుకెళ్ళింది. ఈ పర్ఫార్మెన్స్ లో రష్మీ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్‌, బాధ వల్ల ఆమె కళ్ళల్లో నుండి వచ్చే కన్నీళ్లు షోలోని అందరిచేత కన్నీళ్లు పెట్టించాయి. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇంద్రజ, వర్ష, కృష్ణభగవాన్‌ ఇలా అందరూ రష్మి హార్ట్ బ్రేకింగ్‌ సాంగ్‌కి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా ప్రేమలో మోసపోయిందా అనే ఆలోచన కలుగుతుంది. ఎప్పుడు తన మాటలతో అందరిని నవ్వించే రష్మి ఇలా అందరిని ఒక్కసారిగా ఏడిపించేసింది.