ఆదిని వదలని పవన్ కళ్యాణ్… మరో సినిమాలో ఆదికి వచ్చిన భారీ ఆఫర్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరు మల్లు సినిమా వర్క్ షాప్ లో బిజీగా ఉన్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో హైపర్ ఆదికి క్రిష్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది.హైపర్ ఆది క్రేజ్ నటన నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకున్నటువంటి క్రిష్ స్వయంగా హరిహర వీరు మల్లు సినిమాలో భారీ ఆఫర్ ఇచ్చారని సమాచారం.

వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ కు ఆది వీరాభిమాని ఈ క్రమంలోనే ఆయన గురించి ఎవరైనా మాట్లాడినా అది ఇంత ఎత్తున వారిపై మండిపడతారు. అయితే హైపర్ ఆదికి ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో వెంటనే ఓకే చెప్పారు. ఇదివరకే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన విషయం మనకు తెలిసిందే. అయితే హరిహర వీరమల్లు సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్ర రావడం విశేషం.ఈ సినిమా కనుక హిట్ అయ్యి ఆది పాత్రకు మంచి క్రేజ్ వస్తే ఇకపై పవన్ కళ్యాణ్ నటించే ప్రతి ఒక్క సినిమాలోను హైపర్ ఆదికే అవకాశం ఉంటుందని చెప్పాలి.

గతంలో పవన్ కళ్యాణ్ కమెడియన్ ఆలీతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి ఒక్క సినిమాలో అలీ తప్పకుండా కనిపించేవారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య రాజకీయ మనస్పర్ధలు రావడం వల్ల అలీ పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆలీ స్థానంలో హైపర్ ఆదికి పవన్ కళ్యాణ్ సినిమాలలో అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక హరిహర వీరమల్లు సినిమా కనుక హిట్ అయితే హైపర్ ఆది పవన్ కళ్యాణ్ నటించిన ప్రతి ఒక్క సినిమాలో అవకాశాలు అందుకుంటారు అనడంలో సందేహం లేదు.