ఈసారి “బిగ్ బాస్ 6” లో మెరవనున్న స్టార్ సింగర్ ఎవరో తెలుసా??

తెలుగు బుల్లితెర దగ్గర భారీ క్రేజ్ ఉన్నటువంటి ఎన్నో షో లలో కాస్త లేట్ గానే స్టార్ట్ అయినా కూడా మొదటి సీజన్ నుంచే సెన్సేషన్ రేపి నెంబర్ 1 రియాలిటీ షోగా మారిన ఎంటర్టైనింగ్ షో “బిగ్ బాస్” కోసం అందరికీ తెలుసు. మరి ఇండియా లోనే అత్యధిక రేటింగ్ నమోదు అయ్యే బిగ్ బాస్ షో కూడా మన తెలుగు నుంచే ఉంది.

ఆ రేంజ్ లో తెలుగు ఆడియెన్స్ పట్టం కట్టారు. మరి తెలుగులో ఈ షో ఇంత పెద్ద హిట్ అయ్యినందుకు ఏకంగా ఓటిటి లో కూడా ప్లాన్ చేసి సక్సెస్ కాగా ఇక ఇప్పుడు మేకర్స్ అయితే మళ్ళీ టీవిలో సీజన్ 6 ని సిద్ధం చేస్తున్నారు. అయితే ఈసారి సీజన్లో కూడా అనేక మంది స్టార్స్ కనిపించగా గత సీజన్లో లానే కొందరు స్టార్ సింగర్స్ ని కూడా ఈసారి తీసుకొస్తున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరి ఈ సారి యంగ్ టాలెంట్ స్టార్ సింగర్ రేవంత్ కనిపించనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఇతర సన్నాహాలు చాలా త్వరగా జరుగుతున్నాయి. మరి అధికారిక లిస్ట్ అయితే ఎప్పుడు బయటకి వస్తుందో చూడాలి. ఇక ఈ సీజన్ ని కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ చేస్తుండగా స్టార్ మా ఛానెల్లో యథావిధిగా ఈ షో ప్రసారం కానుంది.